ఆర్టీసీ సమ్మెపై కొనసాగుతున్న చర్చలు..ఉత్కంఠ
ఆర్టీసీ సమ్మెపై సచివాలయంలో చర్చలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. విలీనం, వేతన సవరణ, సంఘాల పునరుద్ధరణపై ప్రభుత్వం నిర్ణయం కోసం కార్మికులు ఎదురుచూస్తున్నారు.
విధాత, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర సచివాలయంలో ఆర్టీసీ సంఘాల జేఏసీ నేతలతో అధికారుల బృందం రెండవ ధఫా చర్చలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాలపై ఉన్నతాధికారుల కమిటీ కార్మిక సంఘాల నాయకులతో చర్చిస్తున్నారు ఇప్పటికే రెండు గంటలకు పైగా చర్చలు కొనసాగుతుండటం విశేషం. ఆత్మహత్య చేసుకున్న శంకర్ గౌడ్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా పెంపుపై డిమాండ్ తో పాటు సమ్మె డిమాండ్లలో ప్రధానమైన ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, వేతన సవరణలపై ముందుగా ప్రభుత్వం ప్రకటించాలని కార్మిక సంఘాల నాయకులు చర్చల్లో పట్టుబట్టారు.
అయితే ప్రభుత్వం డిమాండ్లపై సానుకూలంగా ఉందని, సమ్మె విరమించాలని అధికారుల బృందం కోరింది. చర్చల తర్వాత మంత్రులు భట్టి, పొన్నం, శ్రీధర్, జూపల్లితో అధికారులు భేటీ కానున్నారు. మంత్రులతో భేటీ అనంతరం ఈ మూడు ప్రధాన డిమాండ్లపై పీటముడి వీడుతుందా… ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడుతుందనే దానిపై కార్మికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవి కాకుండా కార్మిక సంఘాలు చేస్తున్న మిగతా డిమాండ్లలో ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం వారితో చర్చల తర్వాత స్పష్టమైన ప్రకటన చేయనుంది.
మా డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఆర్టీసీకి ఇచ్చిన హామీలు నెరవేరిస్తే సమ్మె విరమిస్తామని తెలిపింది. శంకర్‌గౌడ్ కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసింది.
ఇవి కూడా చదవండి :
కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ కు పడుతుంది : ఎంపీ ఈటల రాజేందర్
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram