Telangana | 223 కొత్త పంచాయతీలకు గెజిట్ విడుదల.. 12,991కు చేరిన పంచాయతీలు
రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆరెస్ ప్రభుత్వ హయంలో కొత్తగా 223గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ, మండలిలు బిల్లును ఆమోదించాయి

విధాత, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 223 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆరెస్ ప్రభుత్వ హయంలో కొత్తగా 223గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ, మండలిలు బిల్లును ఆమోదించాయి. ఆ బిల్లును అప్పటి గవర్నర్ తమిళిసై పెండింగ్‌లో పెట్టారు. గత గవర్నర్ రాధాకిషన్ ఆమోదం తెలపడంతో కొత్త పంచాయతీలపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త పంచాయతీల సమాచారాన్ని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు జిల్లాలకు చేరవేశారు. ఇప్పటి వరకు 12,769 గ్రామ పంచాయతీలుండగా కొత్తగా 223 పంచాయతీలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 12,992 పంచాయతీలకు చేరాయి. వీటిలో ములుగు జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పంచాయతీల సంఖ్య 12,991కు చేరింది.