అవమానించారంటూ బీఆరెస్ మహిళా ఎమ్మెల్యేల రాజకీయ దుష్ప్రచారం…కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు ధ్వజం
:శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆరెస్ మహిళా ఎమ్మెల్యేలపై చేసిన విమర్శలపై బీఆరెస్ పార్టీ రాజకీయ రాద్ధాంతం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, పర్ణిక, రాగమయిలు విమర్శించారు.

విధాత, హైదరాబాద్ :శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆరెస్ మహిళా ఎమ్మెల్యేలపై చేసిన విమర్శలపై బీఆరెస్ పార్టీ రాజకీయ రాద్ధాంతం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, పర్ణిక, రాగమయిలు విమర్శించారు. సభా వాయిదా అనంతరం వారు మాట్లాడుతూ సభలో మా పార్టీ నుంచి కూడా ఇద్దరు మహిళా మంత్రులు..మేం ఎమ్మెల్యేలుగా ఉన్నామని, సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసి బీఆరెస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డిని, సునితా లక్ష్మారెడ్డిని అవమానిస్తు ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. కాని సభను ప్రజలను తప్పుదోవపట్టించేందుకు, రాజకీయ రాద్ధంతం చేసేందుకే సబితా, సునీతలు, బీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆరెస్ మహిళా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మా వంటి కొత్త మహిళా ఎమ్మెల్యేలకు ఆదర్శంగా ఉండాలన్నారు. నిజానికి సబిత, సునితలను కాంగ్రెస్ పార్టీనే, మంత్రులుగా చేసిందని, చేవెళ్ల చెల్లెమ్మ అంటూ వైఎస్ ఎంతో గౌరవించారన్నారు. మొన్న మా మహిళా మంత్రి సీతక్కను బీఆరెస్ ఎమ్మెల్యేలు అవమానించేలా మాట్లాడితే మేం దాన్ని సభా వాగ్వివాదంలో భాగంగానే చూశామే తప్పా రాజకీయం చేయలేదన్నారు. గత పది సంవత్సరాలు అధికారం సాగించిన కాలంలో బీఆరెస్ నేతలు మహిళల పట్ల అనుసరించిన వైఖరి అందరికి తెలిసిందేనన్నారు.