నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఒత్తిడి పెట్టారు

నిర్ణీత సమయంలోగా నిర్మాణం పూర్తి చేయాలని గత ప్రభుత్వ పాలకులు అధికారులు తమపై ఒత్తిడి చేశారని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు జస్టిస్ పిసి ఘోష్ కమిటీ ముందు వెల్లడించారు.

నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఒత్తిడి పెట్టారు

ఘోష్ కమిటీ ముందు కాళేశ్వరం కాంట్రాక్టర్ల వెల్లడి

విధాత: నిర్ణీత సమయంలోగా నిర్మాణం పూర్తి చేయాలని గత ప్రభుత్వ పాలకులు అధికారులు తమపై ఒత్తిడి చేశారని కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు జస్టిస్ పిసి ఘోష్ కమిటీ ముందు వెల్లడించారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవకతతో గలపై విచారణ జరుగుతున్న ఘోష్ కమిటీ బుధవారం మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణ సంస్థలు ఎల్ అండ్ టీ, నవయుగ, అఫ్కాన్ సంస్థల ప్రతినిధులను విచారించింది. విచారణ వివరాలను చంద్ర ఘోష్ మీడియాకు వివరించారు.సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన అంశాల ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు ఆనకట్టలపై విచారణ కొనసాగించనుంది. కమిషన్ కు అవసరమైన సాయం అందించేందుకు వీలుగా న్యాయ, సాంకేతిక, ఆడిటింగ్ బృందాలను నియమించుకోనున్నారు. ఇద్దరు న్యాయవాదులు, ఇంజనీరింగ్ నిపుణులతో కూడిన సాంకేతిక బృందం, ఆడిటింగ్ బృందాల నియామకం త్వరలో జరగనుంది. వారి నుంచి అవసరమైన సహాయ, సహకారాలు తీసుకుంటూ జస్టిస్ పీసీఘోష్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేయనున్నారు. నేడు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా , ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్ తో సమావేశమైన జస్టిస్ పీసీ ఘోష్.. సంబంధిత అంశాలు, విచారణ ప్రక్రియపై చర్చించారు. అనంతరం కోల్ కతా వెళ్లారు. వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో మరోమారు రాష్ట్రానికి రానున్నారు. ఆ పర్యటనలో మేడిగడ్డ ఆనకట్టను సందర్శించి.. విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే కొందరికి కమిషన్ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, అధికారులు, ఆనకట్టల పనులు చేసిన గుత్తేదార్లను మొదటి దశలో విచారణకు పిలిచే అవకాశం ఉంది. ప్రజల నుంచి ఏవైనా ఫిర్యాదులు, నివేదనలు వస్తే వాటిని పరిశీలించి నోటీసులు ఇస్తారని తెలిసింది.

నిర్మాణ సంస్థలు తమకు టైమ్ బౌండ్ పెట్టారని చెప్పడం జరిగిందని అయితే అన్ని విషయాలను అఫిడవిట్ ద్వారా వెల్లడించాలని ఆదేశించామని తెలిపారు. డిజైన్స్, నిర్మాణం, నిర్వహణ సంబంధించిన అన్ని అంశాలను ద్వారా ఈనెలాఖరులోపు సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. అప్పటి కొంతమంది అధికారులు రాష్ట్రంలో లేరని వారిని కూడా విచారిస్తామన్నారు. సాక్షాధారాల కోసమే అఫిడవిట్ ద్వారా వివరాలు సమర్పించాలని కోరామన్నారు. తప్పుడు అఫిడవిట్ ఇస్తే తమకు తెలిసిపోతుంది అన్నారు. కాలేశ్వరం కు సంబంధించి విజిలెన్స్ కాగ్ రిపోర్టులు అందాయని తెలిపారు. తప్పుడు వివరాలు సమర్పిస్తే క్రిమినల్ కేసులకు వెనుకాడేది లేదన్నారు.