రాహుల్‌తో తుమ్మల భేటీ

  • Publish Date - October 14, 2023 / 12:04 PM IST

విధాత: ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లారు. కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు డిల్లీ వెళ్లిన తుమ్మల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాతా తుమ్మల తొలిసారిగా రాహుల్‌గాంధీతో భేటీ అయ్యారు. తుమ్మల పార్టీలో చేరిన సందర్భంలో రాహుల్‌కు తగిన సమయం లేక కలువడం కుదరలేదు.


ఈ నేపధ్యంలో ఇప్పుడు తుమ్మలను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించారు. రాహుల్‌తో తుమ్మల అరగంట పాటు భేటీ కాగా, వారి మధ్య రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్యలు జరిగాయి. అలాగే ఖమ్మంలో రాజకీయ పరిణామాలు, పార్టీల బలాబలాలపై చర్చలు జరిగాయని సమాచారం.