9 జిల్లా జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఎంట్రీ లెవల్‌ జిల్లా జడ్జీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 9 పోస్టలు భర్తీకి ఈ నెల14వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు

9 జిల్లా జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

14 నుంచి దరఖాస్తుల స్వీకరణ

విధాత: ఎంట్రీ లెవల్‌ జిల్లా జడ్జీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 9 పోస్టలు భర్తీకి ఈ నెల14వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తులను 14 మే నుంచి 13వ తేదీ జూన్‌ వరకు స్వీకరిస్తారు. ఈ పోస్టుల భర్తీకి 2024 ఆగస్టు 24,25 తేదీలలో రాత పరీక్షలు నిర్వహించాలని టెంటేటీవ్‌గా నిర్ణయించారు. ఈ 9 పోస్టులను ఈ డబ్ల్యు ఎస్‌ కోటాలో 1ఉమెన్‌ , బీసీ ఏ 1, బీసీ బీ1, బీసీ సీ1, బీసీ డీ ఉమెన్‌1, బీసీ ఇ ఉమెన్‌1, ఎస్సీ 2లో ఒకటి ఉమెన్‌, ఎస్టీ 1 ఇలా మొత్తం తొమ్మిది పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో నాలుగు పోస్టులను ఉమెన్‌కు రిజర్వ్‌ చేశారు. ఈ పోస్టుల భర్తీకి చెందిన పూర్తి వివరాలు http;//tshc.gov.in లో పొందు పరిచారు.