గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. సెప్టెంబరు 13న ఉదయం 10.30 గంటల నుంచి హైదారాబాద్, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ తెలిపింది
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విధాత): గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. సెప్టెంబరు 13న ఉదయం 10.30 గంటల నుంచి హైదారాబాద్, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందని కమిషన్ తెలిపింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యాక సమర్పించాల్సిన పత్రాలు ఇంకా ఏమైనా పెండింగ్ లో ఉంటే వాటిని సెప్టెంబరు 15న సమర్పించవచ్చని పేర్కొంది. మొత్తం 783 పోస్టులకు గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ధ్రువ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.in అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram