నిరక్షరాస్యతపై ‘ఉల్లాస్’ యుద్ధం.. అక్షరాస్యత సాధనకు ఐదేళ్ళ ప్రణాళిక
ములుగు జిల్లాలో ‘ఉల్లాస్’ ప్రాజెక్ట్‌తో వేలాది మహిళలు అక్షరాస్యత వైపు అడుగులు వేస్తున్నారు. 2027 వరకు కొనసాగనున్న ఈ ప్రణాళికలో చదువు, డిజిటల్, ఆర్థిక అవగాహనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
పదిహేను సంవత్సరాలు పైబడిన నిరక్షరాస్యులను అక్షరజ్ఞానులుగా తీర్చదిద్దేందుకు అమలు చేస్తున్న ‘ఉల్లాస్’ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమానికి ములుగు జిల్లాలో మహిళల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2022 నుంచి ప్రారంభించిన ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది 2027 వరకు ఐదు సంవత్సరాలపాటు అమలు చేయనున్నారు.
నిరక్షరాస్యులకు చదవడం, రాయడం నేర్పించడంతో పాటు ఆర్ధిక, డిజిటల్ అక్షరాస్యత కల్పిస్తున్నారు. స్వయం సహాయ సంఘాల మహిళలకు సామాజిక, అర్ధిక అభివృద్ధికి సహాయం చేస్తున్నారు. ఈ కార్యక్రమం జిల్లా, మండల స్కూల్ స్థాయిలో అమలు చేస్తున్నారు. జిల్లా డీఆర్డీఎ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులే బోధన చేయడం గమనార్హం. నిరక్షరాస్యత నిర్నూలన, సామాజిక, ఆర్ధికాభివృద్ధితో పాటు స్వయం సహాయ సంఘాల పురోగతి ద్వారా మహిళా సాధికారత లక్ష్యంగా ప్రకటించారు.
ములుగు జిల్లాలో అమలైతున్న ఈ ప్రాజెక్టు కింద 8150 మంది మహిళలు నమోదుచేసుకున్నారు. వీరికి తాజాగా 3వ తరగతి పరీక్ష నిర్వహించారు. జిల్లాలోని 182 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించగా 3924 మంది మహిళలు హాజరయ్యారు. మహిళల సానుకూల స్పందన పట్ల అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నోడల్ ఆఫీసర్ కృష్ణబాబుతో పాటు డీఆర్డీఓ శ్రీనివాసరావు, అధికారులు గొట్టె శ్రీనివాస్, సిద్ధార్ధ రెడ్డి, వేణుగోపాల్ రావు, పద్మ తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram