SC AND ST RESRVATION | ఎస్సీ వర్గీకరణ తీర్పుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పు పట్ల కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

విధాత, హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పు పట్ల కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లుగా, పేదలకు న్యాయం జరగాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందాలని, ఇందుకు వర్గీకరణ తీర్పు మేలు చేస్తుందన్నారు. విద్య, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని బీజేపీ భావించిందని, వర్గీకరణకు అనుకూలంగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రకటన చేశారని, కేంద్రం కేబినెట్ సబ్ కమిటీ వేసిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.