Weather Warning | ఈ రోజు సాయంత్రం తెలంగాణలో ఈదురు గాలులుతో అకాల వర్షాలు.. లిస్టులో మీ జిల్లా ఉందా?
Weather Warning | శుక్రవారం సాయంత్రం (4.4,2025) ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటలకు హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. గురువారం కురిసిన అకాల వర్షానికి తెలంగాణలో చేతికి వచ్చిన పంట దెబ్బతిన్నది. కల్లాల్లో ఆరపోసిన వరి ధాన్యం తడిసి ముద్దైంది. కోతకు వచ్చిన పంట నీట మునిగింది. మామిడికాయలు రాలిపోయాయి. ఈ విషాదం అలా ఉండగానే మరోసారి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram