బీఆరెస్ రాజ్యసభ ఉపనేతగా వద్ధిరాజు … విప్‌గా దీవకొండల నియామకం

రాజ్యసభలో బీఆరెస్‌ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నియమించారు.

బీఆరెస్ రాజ్యసభ ఉపనేతగా వద్ధిరాజు … విప్‌గా దీవకొండల నియామకం

విధాత : రాజ్యసభలో బీఆరెస్‌ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నియమించారు. పార్టీ విప్‌గా ఎంపీ దీవకొండ దామోదర్‌రావునకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు కేసీఆర్‌ లేఖ రాశారు. రాజ్యసభలో బీఆరెస్‌ ఫ్లోర్ లీడర్‌గా సీనియర్ నేత కేఆర్. సురేశ్‌రెడ్డిని కేసీఆర్‌ నియమించారు. పార్లమెంటరీ పార్టీ, రాజ్యసభ పక్షనేతగా ఉన్న కే. కేశవరావు స్థానంలో సురేశ్‌రెడ్డిని నియమించారు. కేకే బీఆరెస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన స్థానంలో సురేశ్‌రెడ్డిని పార్టీ పక్షనేతగా ప్రకటించారు.