తెలంగాణకు ఉప రాష్ట్రపతి జగదీప్ థన్కర్

ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ శుక్రవారం తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ దంపతులకు గవర్నర్ సీపీ రాధాకిషన్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలు స్వాగతం పలికారు.

  • By: Somu |    telangana |    Published on : Apr 26, 2024 5:45 PM IST
తెలంగాణకు ఉప రాష్ట్రపతి జగదీప్ థన్కర్

గవర్నర్‌, సీఎస్‌ల స్వాగతం

విధాత, హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ శుక్రవారం తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో ఉపరాష్ట్రపతి జగదీప్ థన్కర్ దంపతులకు గవర్నర్ సీపీ రాధాకిషన్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలు స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహా ప్రభృతులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అంతకుముందు జగదీప్ థన్కర్ దంపతులు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వారికి దేవస్థాన ఈవో ధర్మారెడ్డి స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపికను అందించారు.