Vijayashanti | బీఆరెస్ అనుకూల వ్యాఖ్యలపై విజయశాంతి వివరణ
తెలంగాణలో బీఆరెస్ పార్టీ అంతరించి పోతుందని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో బీఆరెస్‌కు అనుకూలంగా విజయశాంతి ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టు ఆమె బీఆరెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారానికి దారితీసింది

నా ట్వీట్‌ను తప్పుగా అర్ధం చేసుకున్నారని మరో ట్వీట్
విధాత : తెలంగాణలో బీఆరెస్ పార్టీ అంతరించి పోతుందని బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో బీఆరెస్‌కు అనుకూలంగా విజయశాంతి ట్విట్టర్ వేదికగా చేసిన పోస్టు ఆమె బీఆరెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారానికి దారితీసింది. ఈ ప్రచారంపై ఆమె మళ్లీ ట్విట్టర్ ద్వారానే వివరణ ఇచ్చారు.
దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎలాంటివో గత, ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్థం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం నిన్నటి నా పోస్టులో వ్యక్తపరిచానని, దానిని అవగాహన చేసుకునే తత్వం లేని కొందరు ఆ పోస్టుపై పార్టీ మార్పు అంటూ రాజకీయ వార్తా కథనాలు..వాఖ్యలు చేసి సొంత కల్పన కొనసాగిస్తున్నరని మండిపడ్డారు. అర్ధం చేసుకునే విధానం ఉన్నవారికి చెప్పగలం కానీ.. ఉద్దేశ్యపూర్వకంగా విమర్శ చేయడమే పని పెట్టుకున్న వాళ్లకు వివరణ ఇచ్చిన ప్రయోజనం లేదని ట్వీట్‌లో పేర్కోన్నారు.