విధాత: బీజేపీ ఇందూర్ ప్రజాగర్జన సభలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా సీఎం కేసీఆర్ ఎన్డీఏలో చేరుతారని అడగడటం నిజమై ఉండవచ్చని బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి అభిప్రాయపడ్డారు. గతంలో 2009లో కూడా మహాకూటమి పేరుతో కమ్యూనిస్టులతో కలిసిపోటీ చేసిన కేసీఆర్ కౌంటింగ్ డబ్బాలు తెరువకముందే లూథియానా ఎన్డీఏ ర్యాలీకి హాజరైన వాస్తవం ప్రజలకు ఇంకా జ్ఞాపకముందన్నారు.
కేసీఆర్ రాజకీయ విధానాలు అలా ఉన్నప్పుడు మోడీని కేటీఆర్ తిప్పడం అనవసరం, అసమంజసమని విజయశాంతి తెలిపారు. కొంతకాలంగా విజయశాంతి బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారని, పార్టీ మారుతారని అందుకే పాలమూరు, ఇందూర్ మోడీ సభలకు కూడా హాజరుకాలేదన్న ప్రచారానికి తాజాగా మోడీని సమర్ధిస్తూ ఆమె చేసిన ట్వీట్ కౌంటర్ ఇచ్చినట్లయ్యింది. దీంతో ఆమె బీజేపీలో కొనసాగుతారన్న స్పష్టత వచ్చిందని బీజేపీ శ్రేణులు సృష్టం చేస్తున్నాయి.