హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు బెదిరింపు కాల్స్
విధాత: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను ఓ వ్యక్తి బెదిరించాడు.అసభ్య పదజాలంతో దూషించాడు.దీనిపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.రెండు రోజుల క్రితం సీపీ అంజనీకుమార్ పోలీసు కంట్రోల్ రూం సిబ్బందికి వాట్సాప్ ద్వారా రెండు మొబైల్ నంబర్లను షేర్ చేశారు. సదరు వ్యక్తి సమస్య ఏమిటో కనుక్కోవాలని సూచించారు. దీంతో కంట్రోల్ రూం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మురళీ ఓ నంబర్‌కు ఫోన్ చేశారు.అవతలి వ్యక్తి తన సమస్యను చెప్పేందుకు […]

విధాత: హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌ను ఓ వ్యక్తి బెదిరించాడు.అసభ్య పదజాలంతో దూషించాడు.దీనిపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.రెండు రోజుల క్రితం సీపీ అంజనీకుమార్ పోలీసు కంట్రోల్ రూం సిబ్బందికి వాట్సాప్ ద్వారా రెండు మొబైల్ నంబర్లను షేర్ చేశారు.
సదరు వ్యక్తి సమస్య ఏమిటో కనుక్కోవాలని సూచించారు. దీంతో కంట్రోల్ రూం విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మురళీ ఓ నంబర్‌కు ఫోన్ చేశారు.అవతలి వ్యక్తి తన సమస్యను చెప్పేందుకు నిరాకరిస్తూ సీపీ అంజనీకుమార్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఫోన్ కట్ చేశాడు.మరోమారు ఫోన్ చేయగా అదే పరిస్థితి. సీపీని బెదిరిస్తూ దూషణలు ప్రారంభించాడు.దీంతో కానిస్టేబుల్ మురళీ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.