వెంటనే వకులాభరణం కృష్ణమోహన్ ఈటల రాజేందర్ గారికి క్షమాపణ చెప్పక పోతే తెలంగాణలో తిరగనివ్వం. sc, bc సంఘాల ప్రతినిధులు. బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఈటెల రాజేందర్ పై వకులాభరణం కృష్ణమోహన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం బిసి, ఎంబీసీ, సంచారజాతుల అందరి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. కృష్ణ మోహన్ రావు నీ కులం ఏమిటో తెలంగాణ సమాజానికి చెప్పాలి. దొంగ సర్టిఫికేట్ మీద మూడు సార్లు బీసీ కమిషన్ మెంబర్ అయిన […]
వెంటనే వకులాభరణం కృష్ణమోహన్ ఈటల రాజేందర్ గారికి క్షమాపణ చెప్పక పోతే తెలంగాణలో తిరగనివ్వం.
బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఈటెల రాజేందర్ పై వకులాభరణం కృష్ణమోహన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం బిసి, ఎంబీసీ, సంచారజాతుల అందరి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.
కృష్ణ మోహన్ రావు నీ కులం ఏమిటో తెలంగాణ సమాజానికి చెప్పాలి. దొంగ సర్టిఫికేట్ మీద మూడు సార్లు బీసీ కమిషన్ మెంబర్ అయిన నువు తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి .
దొంగ పనులు చేసేది నువ్వు.
బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.
లేకపోతే ఏ కుల సంఘం కూడా మిమ్మల్ని క్షమించదు. ఏ కుల సంఘం మీటింగ్ కు వచ్చిన నిన్ను అడ్డుకొని తీరుతాం. తెలంగాణలో తిరగలేరు.
రాజేందర్ గారికి క్షమాపణ చెప్తే నే ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నము.
సూర్యారావు,
ఎంబిసి వ్యవస్థాపక అధ్యక్షుడు.
…
అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రానికి దిక్చూసి ఈటల రాజేందర్ అని మాట్లాడిన మీరు ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటు.
జ్యోతిరావు పూలే సభలో నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయావా?
తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు మీరు మాట్లాడే మాటలు అన్నింటిని గమనిస్తున్నారు.
పార్టీలు మారే సంస్కృతి నీది.
మేం పెట్టిన మీటింగ్ కు వచ్చి ఫోటోలు దిగి నువ్వు పెట్టినట్టుగా చెప్పుకొని రాజశేఖర్ రెడ్డి దగ్గర టికెట్ తెచ్చుకుని ఓడిపోయిన చరిత్ర నీది.
నీ వెంబడే ఉంట అని నివ్ ఈటల కు
చెప్పింది నిజమా? కాదా?
నువ్వు బీసీ లకు ఎం చేసినవ్ చెప్పు?
పదవికి ఆశ పడవద్దు భంగపాటు తప్పదు.
తెలంగాణ ప్రజలు నిన్ను తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉంది.
కరుణాకర్
స్థానిక సంస్థల ఫోరం
రాష్ర్ట అధ్యక్షులు.
……
మొగ ముత్తైదవు లాగా ఎవరో ఏర్పాటు చేసిన మీటింగ్స్ కి వచ్చి హాజరయ్యే నీకు ఒక మీటింగ్ పెట్టే దమ్ము లేదు.
తెలంగాణ రాష్ట్రంలో బీసీ కమిషన్ పదవి మళ్లీ వస్తుంది అనో లేదా ఏదో ఒక పదవి వస్తుంది అని అనుకోవచ్చు కృష్ణమోహన్ గారు కానీ కెసిఆర్ గారు 2014 నుంచి ఏ ఉద్యమకారులకు న్యాయం చేయలేదు. నీకు కూడా ఏమీ ఇవ్వరు. రాజేందర్ గారితో ఉంటే కనీసం గౌరవం అయిన ఉండేది.
ఆంధ్రాలో ప్రతి కులానికి ఒక కమీషన్ వేసి , ప్రతి కులానికి ఒక నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది.
ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ డైరెక్టర్లు పెట్టడం జరిగింది. తెలంగాణలో బీసీల కోసం ముఖ్యమంత్రి ఏమీ చేయలేదు.
బీసీ కమిషన్ మెంబర్ ఉన్నప్పుడు బీసీల కోసం ఏనాడైనా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకు పోయి ఈ చిన్న కులాలు పెద్దపెద్ద మీటింగ్‌కి పెడుతున్నాయి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పినవా ? బీసీ కమిషన్ ఏసీ ఆఫీస్ లో కూర్చొని కాలం గడిపినావు.
ఈటెల రాజేందర్ గారి గురించి ఏప్రిల్ 11 వ తేదీన ఆయన అభినవ పూలే అని పోగిడినావు, 20 రోజుల్లోనే ఎలా మారావు. డబ్బులకోసం నువ్ మరీ ఇంత దిగజారుతావని అనుకోలేదు.
కృష్ణ మోహన్ మీకు కూడా నేను అండగా ఉంటాను అని ఈటల గారు చెప్పడం మర్చిపోయావా ? అంతటి గొప్ప వ్యక్తి పైన ఇంత అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం.
దయచేసి ఈరోజు మాట్లాడిన మాటలు వెనక్కు తీసుకో, రాజేందర్ గారికి క్షమాపణ చెప్పు , లేదంటే భవిష్యత్తులో నువ్వు తెలంగాణ లో తిరగలేవని హెచ్చరిస్తున్నాము.