Musi Beautifications Project | ఎవరన్నారు లక్షాయాభైవేల కోట్లని? తూచ్​..141 కోట్లే : రేవంత్​ రెడ్డి

మొత్తంగా నాలుక మడతేసిన రేవంత్​ రెడ్డి, మూసీ ప్రాజెక్టు(Musi Beautifications Project) ఖర్చు విలువే 141 కోట్లైనప్పుడు లక్షాయాభైవేల కోట్లని ఎవరన్నారని ఎదురుప్రశ్న వేసి అందరినీ షాక్​కు గురిచేసారు. అసలది సుందరీకరణ కాదని, పునరుజ్జీవమ(rejuvenation)ని కొత్త పేరుపెట్టారు.

Musi Beautifications Project | ఎవరన్నారు లక్షాయాభైవేల కోట్లని? తూచ్​..141 కోట్లే : రేవంత్​ రెడ్డి

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును లక్షాయాభైవేల కోట్ల(One Lakh Fifty Thousand Crores)తో చేపట్టబోతున్నామని వందలసార్లు చెప్పిన రేవంత్​ రెడ్డి(Revanth Reddy), ఆ వీడియోలు కూడా మీడియా వద్ద ఉన్నాయని తెలిసినా, నిర్మహమాటంగా బొంకాడు. అది సుందరీకరణ కాదని, పునరుజ్జీవ పథకం(Musi rejuvenation project) మాత్రమేనని, దాని ఖర్చు 141 కోట్లే(Rs.141 Cores only)నని నిన్న విలేకరులతో మీడియా సమావేశంలో తెలిపారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మూసీ పునరుజ్జీవ పథకం కోసం డిపీఆర్​(DPR) తయారుచేయడానికి ఐదు కంపెనీలతో ఏర్పడిన కన్సార్టియం(consortium)తో 141 కోట్లతో అగ్రిమెంట్​ చేసుకున్నామని తెలిపారు. ఈ కన్సార్టియంలో మీన్​హార్ట్(Meinhardt)​, కష్​మన్​ అండ్​ వేక్​ఫీల్డ్(Cushman & Wakefield)​ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇది 18 నెలలలో తన నివేదిక సమర్పించాల్సిఉండగా, నిధుల సేకరణకు ప్రభుత్వానికి సహాయకారిగా ఉంటుందని, అలాగే పిపిపి(PPP) పద్ధతిలో చేయాలా? టోల్​(Toll) వసూలు పద్ధతిలో చేయాలా అనేది కూడా కలిసి నిర్ణయిస్తామని రేవంత్​ తెలిపారు. ఈ విషయంలో కేంద్రం కూడా తమకు సహాయం చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాజకీయ కారణాల దృష్ట్యా కేంద్రం ఒకవేళ సహాయం చేయనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతుందని అన్నారు.

ప్రతిపక్షాలు(Opposition) దీనిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థం కావడంలేదన్న ముఖ్యమంత్రి, వారి అన్నిరకాల సందేహాలకు ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, అంతేకాకుండా అఖిలపక్ష సమావేశం కంటే పెద్దదైన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం(Exclusive Assembly session) ఏర్పాటు చేసుకుందామని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసారు. రాజకీయ ఏకాభిప్రాయం సాధించడానికి ఒక క్యాబినెట్​ ఉప సంఘాన్నికూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా రేవంత్​ రెడ్డి స్పష్టం చేసారు.