Road Accident | రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని ముష్టికుంట్ల వద్ద కారు చెట్టుకు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు దంపతులు దుర్మరణం చెందారు.

Reported by: Somu | తెలంగాణ‌ | May 15, 2024, 4:55 pm IST
Read Time: 2 mins
Road Accident | రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

చెట్టుకు ఢీ కొన్న కారు..చెలరేగిన మంటలు

విధాత : ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని ముష్టికుంట్ల వద్ద కారు చెట్టుకు ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు దంపతులు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే ఖమ్మంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన సూర్యనారాయణ, రుక్మిణి దంపతులు మరో ఇద్దరు కలిసి కారులో బోనకల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు ముష్టికుంట్ల వద్దకు రాగానే అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు ధ్వంసమవ్వగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు దంపతులు సూర్యనారాయణ, రుక్మిణిలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. గమనించిన అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.