Wine Shops | మందుబాబులకు షాక్.. తెలంగాణలో రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్
Wine Shops | ఈ నెల 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖను ఈసీ ఆదేశించింది.
Wine Shops | హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖను ఈసీ ఆదేశించింది. దీంతో ఈ నెల 11వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులు ఉల్లంఘించిన మద్యం దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీన కూడా వైన్ షాప్స్ బంద్ ఉండనున్నాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వివాదాలు, ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram