యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ​ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

 

విధాత : నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ప్లాంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ​ప్లాంట్‌లోని యూనిట్-3 పరిధిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యుద్ఘాతం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

ప్లాంట్లోని యూనిట్-3 పరిధిలో గల టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ (TDBFP) ఏరియాలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ ఉత్పాదన ప్రక్రియకు అత్యంత కీలకమైన బాయిలర్ ఫీడ్ పంప్ వద్ద ఒక్కసారిగా ఆయిల్ లీకేజీ అయి.. మంటలు రేగినట్లుగా సమాచారం. మంటల కారణంగా ప్లాంట్ లోని కంట్రోల్ కేబుల్స్, పలు కీలకమైన వాల్వులు కాలిపోయాయని, అయితే కీలకమైన ప్రధాన టర్బైన్ యంత్రాలకు ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు.

 

Latest News