అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకందించడమే లక్ష్యం ,అధికారులు సమన్వయంతో పనిచేయాలి … మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరికీ చేరువయ్యే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు

అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకందించడమే లక్ష్యం ,అధికారులు సమన్వయంతో పనిచేయాలి … మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

విధాత, వరంగల్ ప్రతినిధి:అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలందరికీ చేరువయ్యే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు.శనివారం మహబూబాబాద్  ఐ.డి.ఓ.సి లోని సమావేశ మందిరంలో వివిధ శాఖల సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అధ్యక్షతన ముఖ్య అతిధిగా రాష్ట్ర మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ శాసనసభ సభ్యులు డాక్టర్ భూక్య మురళీ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మునిసిపల్ చైర్ పర్సన్ డాక్టర్ పాల్వాయి రాం మెహన్ రెడ్డి లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రత్యేక అధికారుల ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల సమస్యలను పరిష్కరించేలా సమీక్షలు నిర్వహించి, టార్గెట్ లను నిర్దేశించుకొని పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు న్యాయంగా లబ్ధిదారులకు అందేలా, స్మార్ట్ గా ఆలోచించి టెక్నీకల్ గా పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఉత్తమ విద్యను అందించే విధంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో మత్తు పదార్థాల పై అవగాహన తరగతులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఐ.టి.డి.ఏ పరిధిలోని మండలం కేంద్రాలలో గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలో ట్రైబల్ వెల్ఫెర్ వసతి గృహాలలో చుట్టు పరిసరాల పరిశుభ్రత పై దృష్టి సారించాలన్నారు. రోజు వారీగా హాస్టళ్లను తనిఖీ చేయాలన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించి విద్యాబోధన, నాణ్యమైన భోజనం అందించాలన్నారు. సరకుల అక్రమ రవాణా జరుగకుండా కఠినంగా వ్యవహరించి అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. నకిలీ విత్తనాలపై దృష్టి సారించి జిల్లాలోని టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎరువుల, విత్తనాల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ పాఠశాలల్లో పరిశుభ్ర వాతావరణం, నాణ్యమైన ఆహారం పిల్లలకు అందించాలని, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సెగ్రిగేషన్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల ద్వారా మొక్కలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆర్థికాభివృద్ధి కోసం మహిళా సంఘాలకు జిల్లాలో మహిళా క్యాoటీన్ లను ప్రారంభించడానికి అనువైన స్థలాలను గుర్తించాలని అన్నారు.
ఈ సమావేశంలో డి.ఎఫ్.ఓ బత్తిని విశాల్ రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, అదనపు ఎస్పీ చెన్నయ్య, జెడ్పీ ఇంచార్జి సీ.ఈ.ఓ నర్మద, పంచాయతీ రాజ్ ఎస్.ఈ సురేష్ వివిధ శాఖల అధికారులు, మండల అధికారులు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

**