• Telugu News
  • /Telangana

California Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన మేఘనారాణి, భావన మృతి చెందారు. వెకేషన్ నుంచి వస్తుండగా కారు లోయలో పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Dec 29, 2025, 8:02 pm IST
Read Time: 4 mins
California Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలంగాణ యువతులు మృతి

California Car Crash | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ యువతులు మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరు గ్రామానికి చెందిన కడియాల భావన(24) కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ క్రమంలో వారు ఇద్దరూ కూడా కాలిఫోర్నియాలో ఉంటున్నారు. స్నేహితులతో కలిసి వెకేషన్‌కి వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారు శనివారం రాత్రి లోయలో పడిపోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మేఘనారాణి, భావన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

ఉన్నత చదువులు చదివేందుకు మేఘన, భావన మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. చదువులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అల్బామా హిల్స్‌లో ఒక ప్రమాదకరమైన మలుపు వద్ద ఆమె తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వాహనం అదుపు తప్పడంతో రోడ్డు నుంచి లోయలోకి జారి పోయిందని తెలుస్తున్నది.

మేఘన, భావన చురుకైన విద్యార్థినులని వారి కుటుంబీకులు చెబుతున్నారు. మృతదేహాలను భారతదేశానికి తెప్పించేందుకు కేంద్ర విదేశాంగశాఖ, తెలంగాణ ప్రభుత్వం చొరవ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని భారత దౌత్య కార్యాలయంతో సంప్రదింపులు చేయాలని అధికారులను కోరారు. ఈ కేసును కాలిఫోర్నియా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను భారతదేశానికి పంపేందుకు అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ ప్రతినిధులు అక్కడి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ, రెండు బాధిత కుటుంబాలకు మద్దతు పలుకుతున్నారు.

ఇవి కూడా చదవండి :

Pooja Hegde | బుట్టబొమ్మ తళుకుల మెరుపులు… యువరాణిలా పూజా హెగ్డే
Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల, యాదగిరిగుట్టలు