Mahabubabad : చావు దగ్గరికి వెళ్లాడు….పట్టాలపై పడుకొని……

కేసముద్రం రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు కిందగా పట్టాలు దాటే ప్రయత్నంలో యువకుడు చావు తప్పించాడు. లోకోపైలట్ వెంటనే రైలు ఆపడంతో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు.

Mahabubabad : చావు దగ్గరికి వెళ్లాడు….పట్టాలపై పడుకొని……

రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రైలు ఆగి ఉందని ఓ వ్యక్తి రైలు కింద నుంచి పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. అయితే అప్పుడే రైలు కదిలింది. దీంతో అక్కడే ఉన్నవారంతా గట్టిగా కేకలు వేశారు. రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తి అలానే పట్టాలపై పడుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన లోకో పైలెట్ రైలును నిలిపివేశారు. దీంతో రైలు పట్టాలపై పడుకున్న ఆ వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. అయితే అప్పటివరకు గట్టిగా కేకలు వేస్తూ ఈ దృశ్యాలను చూస్తున్నవారంతా రైలు పట్టాలపై ఉన్న వ్యక్తి ప్రాణాలతో బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం రైల్వే స్టేషన్ లో ఇటీవల జరిగింది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వ్యక్తి ఎవరనే విషయమై వివరాలు తెలియాల్సి ఉంది.

కేసముద్రం రైల్వే స్టేషన్ లో మూడోలైన్ వైపు పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కాలేదు. దీంతో స్థానికులు ఇబ్బందిపడుతున్నారు. అమీనాపురం వెళ్లాలంటే పట్టాలు దాటుకొని వెళ్లాల్సి వస్తుంది. ఇలా పట్టాలు దాటే సమయంలో ప్రాణాల మీదికి తెచ్చకుంటున్నారు. అమీనాపురం వైపునకు వెళ్లే ఓ వ్యక్తి పట్టాలు దాటాలనకున్నారు. అయితే ఈ పట్టాలపై గూడ్స్ రైలు ఆగి ఉంది. ఆయన పట్టాలు దాటాలంటే గూడ్స్ రైలు కింద పడుకొని దాటాలి. ఆయన పట్టాలపై పడుకొని పట్టాలు దాటాలని ప్రయత్నించారు. అదే సమయంలో గూడ్స్ రైలు స్టార్ట్ అయింది. అయితే అక్కడే ఉన్నవారు ఇది చూసి గట్టిగా కేకలు వేశారు. దీంతో ఆ వ్యక్తి కదలకుండా పట్టాలపై పడుకున్నారు. ఈ కేకలు విన్న గూడ్స్ రైలు లోక్ పైలట్ రైలును నిలిపివేశారు. అప్పడు పట్టాలపై పడుకున్న వ్యక్తి బయటకు వచ్చారు. ఇటీవల ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.