చెరువులు, కుంటలకు జలకళ.. ఇటీవల వర్షాలతో మెరుగైన పరిస్థితి
రాష్ట్రంలో 34,716 చెర్వులు, కుంటలుండగా వాటిలో ఇటీవల వర్షాలకు 6735 చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయని ఇరిగేషన్ శాఖ వెల్లడించింది

నిండిన 6,735చెరువులు
విధాత, హైదరాబాద్ :రాష్ట్రం లో 34,716 చెర్వులు, కుంటలుండగా వాటిలో ఇటీవల వర్షాలకు 6735 చెరువులు నిండుగా నీటితో కళకళలాడుతున్నాయని ఇరిగేషన్ శాఖ వెల్లడించింది. 3247 చెరువులు మత్తడి దుంకుతున్నాయని, 3438 చెరువుల్లో 50 నుంచి 75 శాతం నీటి నిల్వలున్నాయని, 6165 చెరువులు 25 నుంచి 50 శాతం నీరు చేరిందని తెలిపింది. 15131 చెరువుల్లో నీటి నిల్వలింకా 25 శాతం లోపలే ఉన్నాయని పేర్కోంది. ప్రస్తుతం కృష్ణా, గోదావరి సహా వాటి ఉప నదుల పరిధిలోని ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో పాటు ఎత్తిపోతల పథకాల నేపథ్యంలో వాటి పరిధిలోని చెరువులు, కుంటలు నిండే అవకాశముందని తెలిపింది.