Lavanya Tripathi | ఆ స్పెష‌ల్ డే రోజే వ‌రుణ్‌- లావ‌ణ్య వివాహం.. బంగారంతో పెళ్లి కార్డ్!

Lavanya Tripathi | మెగా ఫ్యామిలీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, శ్రీజ‌, నిహారిక వంటి వారు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి త‌మ భాగ‌స్వామితో విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. వారి విడాకుల నిర్ణ‌యం మెగా అభిమానుల‌ని చాలా బాధించింది. ఎన్నో కోట్లు ఖ‌ర్చు పెట్టి అంగ‌రంగ వైభవంగా పెళ్లి చేసుకొని క‌నీసం ప‌దేళ్లు కూడా సంసారం చేయ‌కుండా విడాకులు తీసుకోవ‌డంపై కొంద‌రు ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. కనీసం త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న వారి జీవితాల‌లో ఇలాంటి […]

Lavanya Tripathi | ఆ స్పెష‌ల్ డే రోజే వ‌రుణ్‌- లావ‌ణ్య వివాహం.. బంగారంతో పెళ్లి కార్డ్!

Lavanya Tripathi |

మెగా ఫ్యామిలీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, శ్రీజ‌, నిహారిక వంటి వారు పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి త‌మ భాగ‌స్వామితో విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. వారి విడాకుల నిర్ణ‌యం మెగా అభిమానుల‌ని చాలా బాధించింది. ఎన్నో కోట్లు ఖ‌ర్చు పెట్టి అంగ‌రంగ వైభవంగా పెళ్లి చేసుకొని క‌నీసం ప‌దేళ్లు కూడా సంసారం చేయ‌కుండా విడాకులు తీసుకోవ‌డంపై కొంద‌రు ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు.

కనీసం త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న వారి జీవితాల‌లో ఇలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని సూచించారు. అయితే వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి విష‌యంలో నాగబాబు అదే త‌ప్పు మ‌ళ్లీ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

నిహారిక- చైత‌న్య పెళ్లి కోసం దాదాపు 50 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి ఘ‌నంగా పెళ్లి నిర్వ‌హించాడు. కానీ రెండేళ్ల‌కే విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల నిర్ణ‌యంతో పెట్టిన ఖ‌ర్చంతా కూడా బూడిద‌లో పోసిన పన్నీరుగా మారింది.

వీటిని దృష్టిలో పెట్టుకొని వ‌రుణ్ తేజ్ పెళ్లిని చాలా త‌క్కువ ఖ‌ర్చుతో చేస్తాడేమో అని అంద‌రు అనుకున్నారు. కాని త‌గ్గేదే లే అన్న‌ట్టు వ‌రుణ్ తేజ్ పెళ్లికి కూడా భారీగానే ఖ‌ర్చు చేయ‌బోతున్న‌ ట్టు తెలుస్తుంది. ఆగస్టు 24వ తేదీ ఇటలీలో ఈ ఇద్ద‌రి పెళ్లిని గ్రాండ్ గా జరిపే ఆలోచ‌న చేస్తుందంట మెగా ఫ్యామిలీ.

అయితే పెళ్లికి ఇండ‌స్ట్రీకి సంబంధించిన వారెవ‌రు హాజ‌రు కావ‌డం లేద‌ని తెలుస్తుండ‌గా, కేవ‌లం మెగా – అల్లు కుటుంబం స‌మ‌క్షంలో మాత్ర‌మే వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠిలు ఏడ‌డుగులు వేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.ఇక పెళ్లి త‌ర్వాత హైద‌రాబాద్‌లో భారీ ఎత్తున రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, రిసెప్ష‌న్ వేడుక‌కి టాలీవుడ్ ప్ర‌ముఖులు అందరు త‌ర‌లిరానున్న‌ట్టు స‌మాచారం.

ఇక వెడ్డింగ్ కార్డ్‌ని బంగారు పూత‌తో పొందు ప‌రుస్తున్నట్టు ఓ ప్రచారం జ‌రుగుతుంది. ఈ వార్త విన్న వారంద‌రు ఇప్ప‌టికే అన్ని కోట్లు న‌ష్ట‌పోయిన కూడా మ‌ళ్లీ అంత ఎందుకు ఖ‌ర్చు చేస్తున్నారంటూ ప్ర‌శ్నిస్తున్నారు. అయితే వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించి జ‌రుగుతున్న ప్ర‌చారాల‌లో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.