Suryapet |
సూర్యాపేటలో 120 అడుగుల చిరంజీవి బోళాశంకర్ సినీమా కటౌట్
విధాత: తెలుగు చలన చరిత్ర లో నే అతిపెద్ద సినీ ప్రచార కటౌట్ ఏర్పాటు చేసిన ఘనత సూర్యాపేట జిల్లా చిరు అభిమానులకు దక్కింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన బోళాశంకర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంల ఎన్‌హెచ్ 65జాతీయ రహదారి పక్కన రాజుగారి తోట రెస్టారెంట్ వద్ద 120అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.
టాలీవుడ్ ఫిలీం ఇండస్ట్రీ చరిత్రలోనే అతిపెద్ద కటౌట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసుకుని ఇక్కడ 120అడుగుల కటౌట్‌ను ఏర్పాటు చేసినట్లుగా అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరు వెంకన్నగౌడ్ తెలిపారు.