Best Hill Stations | ఎండకాలం ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్లో చాలామంది హిల్స్టేషన్లకు వెళ్లాలని భావిస్తుంటారు. దేశవ్యాప్తంగా సీజన్ల వారీగా సందర్శించేందుకు అనేక హిల్స్టేషన్లు ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. వేసవిలో పర్యటించేందుకు అనువైన హిల్స్టేషన్లు ఉన్నాయి. వేసవిలో ఇక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం మనసును దోచేస్తుంది. సమ్మర్లో పర్యటించేందుకు బెస్ట్ హిల్ స్టేషన్లు ఏవో తెలుసుకుందాం రండి..!
Best Hill Stations | ఎండకాలం ఎండలు మండిపోతున్నాయి. సమ్మర్లో చాలామంది హిల్స్టేషన్లకు వెళ్లాలని భావిస్తుంటారు. దేశవ్యాప్తంగా సీజన్ల వారీగా సందర్శించేందుకు అనేక హిల్స్టేషన్లు ఉన్నాయి. పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. వేసవిలో పర్యటించేందుకు అనువైన హిల్స్టేషన్లు ఉన్నాయి. వేసవిలో ఇక్కడి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఆహ్లాదకరమైన వాతావరణం మనసును దోచేస్తుంది. సమ్మర్లో పర్యటించేందుకు బెస్ట్ హిల్ స్టేషన్లు ఏవో తెలుసుకుందాం రండి..!
లాచుంగ్ హిల్‌స్టేషన్ సిక్కిం రాష్ట్రంలో ఉంది. టిబెట్‌కు దగ్గరలో ఉత్తర సిక్కీంలో జిల్లాలో ఉంది. వేసవిలో ఇక్కడికి వెళ్తే విహారయాత్రను ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. లాచుంగ్ హిల్‌స్టేషన్ చేరుకునేందుకు మొదట సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు చేరుకోవాలి. అక్కడి లాచుంగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడికి చేరుకోవడం కొంత ప్రయాస తప్పదు. అయితే, ఇక్కడి అందమైన లోయలు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకుల మనసును దోచేస్తుంది. ఎంత సమయం గడిపినా.. ఇంకా ఇక్కడే ఉండాలని అనిపించేలా ఉంటుంది వాతావరణం. టెక్కింగ్ చేసేవారికి ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుంది. లాచుంగ్ నది సుందర దృశ్యాలను సైతం పర్యాటకులు వీక్షించేందుకు అవకాశం ఉన్నది. స్థానిక జీవితాన్ని ఆస్వాదించేందుకు హోం స్టేను ఎంచుకుంటే.. విహారయాత్రను మరింత ఉత్సాహంగా మార్చుకోవచ్చు.
నౌకుచియాటల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నది. భీంతాల్, నైనిటాల్ మధ్య ఉంటుంది. ఇక్కడికి చాలాతక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ఎక్కువగానే హిల్‌స్టేషన్స్ ఉంటాయి. నైనిటాల్ తదితర ప్రముఖ హిల్‌స్టేషన్స్ సైతం ఉన్నాయి. దాంతో నౌకు చిటాయల్ హిల్‌స్టేషన్ చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దాంతో ఇక్కడ రద్దీ ఉండదు. దాంతో వేసవిలో విహారయాత్రకు వెళ్లే వారికి ఈ హిల్‌స్టేషన్ ఎంతో అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ పర్యాటకులు అందమైన పర్వత దృశ్యాలను నేరుగా చూడొచ్చు. బోటింగ్‌తో పాటు పారాగ్లైడింగ్ వంటి అడ్వెంచర్స్లోనూ పాల్గొనవచ్చు. వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రతలు 11 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంటాయి. మార్చి – జూన్, సెప్టెంబర్ – నవంబర్ నెలల పర్యటనకు అనుకూలంగా ఉంటాయి.
చక్రతా హిల్‌స్టేషన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ జిల్లాలో ఉన్నది. డెహ్రాడూన్ నుండి 98 కిలోమీటర్ల దూరంలో.. సముద్రమట్టానికి 2118 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చక్రాత బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మొదటి కంటోన్మెంట్. పశ్చిమాన హిమాచల్ ప్రదేశ్, తూర్పున ముస్సోరీ (73 కి.మీ), తెహ్రీ గర్వాల్ ఉన్నాయి. వేసవిలో చక్రతాలో పర్యటించేందుకు అనుకూలంగా ఉంటుంది. చుట్టూ అందమైన హిమాలయాలతో నిండి ఉన్న ఈ ప్రదేశం గురించి ఎక్కువ మందికి తెలియదు. ఉత్తరాఖండ్‌లో ఉన్న ముస్సోరికి ఎక్కువగా వెళ్తుంటారు. చక్రతాలో మంచులో స్కీయింగ్, కొండల్లో రాపెల్లింగ్ చేయవచ్చు. ఇక్కడ టైగర్ ఫాల్ సైతం ఉంది. ఈ ప్రాంతంలో ప్రకృతి ప్రేమికులను మంత్రముగ్ధులను చేస్తుంది.
ఖజ్జియార్ హిల్‌స్టేషన్ హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉంది. డల్హౌసీ నుంచి 24 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. ఖజ్జియార్ అందాలను మాటల్లో వర్ణించలేం. ఇదో అందమైన హిల్‌స్టేషన్. ఈ ప్రదేశాన్ని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి. గుర్రపు స్వారీ, పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్ చేయవచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి ఖజ్జియార్ గమ్యస్థానమంగా నిలుస్తుంది. సరస్సు, భారీ వృక్ష సంపద, పచ్చటి గడ్డి మైదానాలు, అడవులతో నిండి ఉంటుంది. పశ్చిమ హిమాలయాల్లో భాగమైన ధౌలధర్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టం నుంచి సుమారు 6500 అడుగుల ఎత్తులో ఉంటుంది.