Visa-Free Entry | భారతీయులకు గుడ్‌న్యూస్.. పర్యాటకులకు ఫిలిప్పీన్ ఈ-వీసా..!
Visa-Free Entry | భారతీయులకు గుడ్‌న్యూస్. పర్యాటకుల కోసం వీసా నిబంధనలను సవరించేందుకు ఫిలిప్పీన్ సిద్ధమవుతున్నది. దాంతో భారతీయులు ఆ దేశానికి వెళ్లడం సులభతరం కానున్నది. ఫిలిప్పీన్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ-వీసా ప్రక్రియను ప్రారంభించారు.

Visa-Free Entry | భారతీయులకు గుడ్‌న్యూస్. పర్యాటకుల కోసం వీసా నిబంధనలను సవరించేందుకు ఫిలిప్పీన్ సిద్ధమవుతున్నది. దాంతో భారతీయులు ఆ దేశానికి వెళ్లడం సులభతరం కానున్నది. ఫిలిప్పీన్ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ-వీసా ప్రక్రియను ప్రారంభించారు. పర్యాటకం, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించే కార్యక్రమం కింద భారతీయ పౌరులు నిర్దిష్ట షరతులతో ఫిలిప్పీన్స్‌కి వీసా లేకుండానే వెళ్లేందుకు అవకాశం లభించనున్నది. ఈ వీసా నిబంధనల మేరకు భారతీయ పర్యాటకులు 14 రోజుల పాటు ఫిలిప్పీన్స్‌లో పర్యటించేందుకు అనుమతి లభించనున్నది. ఫిలిప్పీన్స్‌కు వీసా రహిత ప్రవేశాన్ని కోరుకునే భారతీయ పర్యాటకులు తప్పనిసరిగా యూఎస్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, యూకేలో చెల్లుబాటయ్యే, లేదంటే గడువు లేని వీసా, శాశ్వత నివాసానికి అనుమతి కలిగి ఉండాలి. అలాగే, పాస్‌పోస్ట్ కూడా తప్పనిసరిగా ఉండాలి.
ఫిలిప్పీన్స్‌లో ఉండాలనుకున్నప్పటికీ కనీసం ఆరునెలల వరకు చెల్లుబాటులో ఉండాలి. పర్యాటకులు తిరుగు ప్రయాణంలో టికెట్లు చూపించాల్సి ఉంటుంది. అదనంగా సందర్శకులు ఫిలిప్పీన్స్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, నేషనల్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ, ఇంటర్‌పోల్‌లో ఎలాంటి నెగెటివ్ రికార్డు ఉండకూడదు. వీసా ఫ్రీ ఎంట్రీ కింద భారతీయులు 14 రోజుల పాటు పర్యటించేందుకు అవకాశం ఉంటుంది. కావాలనుకుంటే దాన్ని మరో వారం పాటు పొడిగించుకోవచ్చ. వీసా ఎంట్రీ కేవలం పర్యాటక ప్రయోజనం కోసం మాత్రమేనని.. ఇతర వీసా వర్గాలకు మార్చడం సాధ్యం కాదని నిబంధనల్లో పేర్కొంది. వీసా రహిత ప్రవేశంతో పాటు, భారతీయ సందర్శకుల కోసం ఇ-వీసా ప్రక్రియను వేగవంతం చేయాలని అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ ఆదేశించారు. వీసాలు పొందేందుకు పట్టే సమయాన్ని తగ్గించడం, తద్వారా ఫిలిప్పీన్స్‌ని సందర్శించాలనుకునే భారతీయ పౌరులకు వేగవంతమైన ప్రయాణ ప్రణాళికలను సులభతరం చేయడం దీని లక్ష్యం.