Visa Free Countries | ప్రపంచాన్ని చుట్టిరావాలని, కొత్త ప్రదేశాలను చూడాలని చాలా మంది కల. ఇందుకోసం వీసాలు తీసుకోవడం తప్పనిసరి. కానీ, కొన్ని దేశాలు మాత్రం భారతీయులకు ఆయా దేశంలో వీసా ఊసు లేని పర్యటనలకు వీలు కల్పిస్తున్నాయి. పలు దేశాలు ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం అందిస్తున్నాయి. వీసా ఫ్రీ ఎంట్రీ అందిస్తున్న దాదాపు 23 దేశాలు వీసాలు లేకుండానే దేశాల గురించి తెలుసుకుందాం. వీసా లేకుండా పర్యటనకు అవకాశం కల్పించే దేశాల్లో గరిష్ఠ కాల పరిమితి ఉంటుంది.
Visa Free Countries | ప్రపంచాన్ని చుట్టిరావాలని, కొత్త ప్రదేశాలను చూడాలని చాలా మంది కల. ఇందుకోసం వీసాలు తీసుకోవడం తప్పనిసరి. కానీ, కొన్ని దేశాలు మాత్రం భారతీయులకు ఆయా దేశంలో వీసా ఊసు లేని పర్యటనలకు వీలు కల్పిస్తున్నాయి. పలు దేశాలు ‘వీసా ఆన్ అరైవల్’ సౌకర్యం అందిస్తున్నాయి. వీసా ఫ్రీ ఎంట్రీ అందిస్తున్న దాదాపు 23 దేశాలు వీసాలు లేకుండానే దేశాల గురించి తెలుసుకుందాం. వీసా లేకుండా పర్యటనకు అవకాశం కల్పించే దేశాల్లో గరిష్ఠ కాల పరిమితి ఉంటుంది. అంతకు మించి ఎక్కువ కాలం ఉంటే జరిమానాలతో పాటు దేశం నుంచి బహిష్కరించడంతో పాటు చట్టపరమైన ఇబ్బందులు తప్పవు. తప్పసరిగా పర్యటన కాలానికి సంబంధించి.. గడువు తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు తప్పనిసరిగా ముందు రిటర్న్ టికెట్‌ను తీసుకెళ్లాలి. అయితే, బస చేసేందుకు అవసరమైనంత డబ్బు ఉందని.. చెల్లుబాటయ్యే క్రెడిట్ కార్డులు, బ్యాంక్ స్టేట్మెంట్, నగదుకు సంబంధించి రుజువులు చూపించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు క్రిమినల్ రికార్డ్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. క్రిమినల్ ట్రాక్ ఉంటే ఆయా దేశాల్లోకి అనుమతి ఇవ్వరు.
వీసా లేకుండా అంగోలాలో నెల రోజులు గడుపవచ్చు. బార్బడోస్ 90 రోజులు, భూటాన్ 14 రోజులు పర్యటించవచ్చు. డొమినికా 180 రోజులు, ఎల్ సాల్వడార్ 90 రోజులు, ఫిజీ 120 రోజులు ఉండవచ్చు. గాబన్ 30 రోజులు, గాంబియాలో 90 రోజులు, గ్రెనడా 90 రోజులు, హైతీ 90 రోజులు, జమైకా వీసా లేకుండానే ఉండేందుకు అవకాశం ఇస్తుంది. . కజాఖ్స్తాన్ 14 రోజులు, మకావు 30 రోజులు, మారిషస్ 90 రోజులు, మైక్రోనేషియా 30 రోజులు, నేపాల్, పాలస్తీనియన్ టెరిటరీస్ వీసా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తున్నాయి. సెయింట్ కిట్స్-నెవిస్ 90 రోజులు, సెనెగల్ 90 రోజులు, సెయింట్ విన్సెంట్-గ్రెనడైన్స్ 90 రోజులు, ట్రినిడాడ్-టొబాగో 90 రోజులు, వనాటు 30 రోజులు, కిరిబాటి 90 రోజులు వీసా లేకుండా పర్యటించవచ్చు.
అల్బేనియా, ఆంటిగ్వా అండ్ బార్బుడా, అర్మేనియా, ఆస్ట్రేలియా, అజర్బైజాన్, బహామాస్, బహ్రెయిన్, బెనిన్, బొలీవియా, బోట్స్వానా, బుర్కినా ఫాసో, కంబోడియా, కామెరూన్, కొలంబియా, కాంగో (డెమ్ రెప్), జిబౌటీ, ఈక్వెడార్, ఈజిప్ట్, ఈక్వటోరియల్ గినియా, ఇథియోపియా, జార్జియా, గినియా, ఇండోనేషియా, ఇరాన్, జోర్డాన్, కెన్యా ఈ వీసా సౌకర్యం కల్పిస్తున్నాయి. కిర్గిజిస్తాన్, లావోస్, లెసోతో, మలావి, మలేషియా, మోల్డోవా, మంగోలియా, మొరాకో, మొజాంబిక్, మయన్మార్, నైజీరియా, ఒమన్, పాపువా న్యూ గినియా, రష్యన్ ఫెడరేషన్, రువాండా, సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ, సియెర్రా లియోన్, సింగపూర్, దక్షిణాఫ్రికా, దక్షిణ సూడాన్, తజికిస్తాన్, టాంజానియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, జాంబియా దేశాలు ఈ వీసాలను జారీ చేస్తున్నాయి.