ఫార్మా మాఫీయాతో మోడి ప్రభుత్వం కుమ్మక్కయ్యిందా?

ఒక సీనియర్ జర్నలిస్ట్(SVR) పరిశోధన లో షాకింగ్ విషయాలు • జాతి ప్రయోజనాలకన్నా ఆ రెండు కంపెనీల ప్రయోజనాలు ముఖ్యమా? • వేల మంది మరణాలకు, లక్షల మంది వ్యాధి బారిన పడడానికి బాధ్యత ఎవరిది? • వాక్సిన్ కోసం దేశంలో రోజూకు కిలో మీటర్ల మేర ప్రజలు క్యూలో ఉంటున్నారు. దీనికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? • వాక్సిన్ తయారీ, సరఫరా అనుమతి అంతా కేంద్రం కనుసన్నల్లోనే జరుగుతోంది. దానికి తోడు జాతీయ […]

ఫార్మా మాఫీయాతో మోడి ప్రభుత్వం కుమ్మక్కయ్యిందా?

ఒక సీనియర్ జర్నలిస్ట్(SVR) పరిశోధన లో షాకింగ్ విషయాలు

జాతి ప్రయోజనాలకన్నా ఆ రెండు కంపెనీల ప్రయోజనాలు ముఖ్యమా?

వేల మంది మరణాలకు, లక్షల మంది వ్యాధి బారిన పడడానికి బాధ్యత ఎవరిది?

వాక్సిన్ కోసం దేశంలో రోజూకు కిలో మీటర్ల మేర ప్రజలు క్యూలో ఉంటున్నారు. దీనికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా?

• వాక్సిన్ తయారీ, సరఫరా అనుమతి అంతా కేంద్రం కనుసన్నల్లోనే జరుగుతోంది. దానికి తోడు జాతీయ విపత్తు సమయంలో కూడా రాష్ట్ర అధికారాలను సైతం కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవడం మోడి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పా? కాదా?

• కోవాక్సిన్ కనిపెట్టిన భారత్ బయోటెక్, కోవీషీల్డ్ వాక్సిన్ ను తయారు చేసిన సీరమ్ ఇండియా కంపెనీలను అభినందించాల్సిందే అదే సమయంలో వాటికి రైట్స్ ఇవ్వడం కూడా ఏమాత్రం తప్పు కాదు.

• కానీ వాటికి దేశం మొత్తానికి సరిపడా వాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం లేనప్పుడు ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాక్సిన్ తయారీ ని మిగతా ఉత్పత్తి సామర్థ్యం ఉన్న కంపెనీలతో పంచుకొని ప్రజల కోసం వాక్సిన్ ఉత్పత్తిని తయారు చేయించడం కేంద్ర ప్రభుత్వం పని కాదా?

• మోడి మాత్రం అలా చెయ్యరు ఎందుకంటే ఆయనకు జాతి ప్రయోజనాలకన్నా ఫార్మా కంపెనీల ప్రయోజనాల ముఖ్యం.

• కొన్ని చోట్ల మొదటి టీకా వేసుకున్న వారికి సమయం గడిచిపోతున్న రెండో టీకా దొరకడం లేదు..? దీనికి మోడి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా?

• దేశీయా అవసరాలు తీరకుండా విదేశాలకు వాక్సిన్ ను అమ్ముకోవడం కోసం ఆ రెండు కంపెనీలకు అనుమతులిచ్చిన మోడి ప్రభుత్వానిది తప్పా? కాదా?

• దేశంలో దాదాపు 10 సంస్థలకు కరోనా వాక్సిన్ తయారు చేసే సామర్థ్యం ఉన్నా కేవలం భారత్ బయోటెక్, సీరమ్ ఇండియా సంస్థలకు మాత్రమే అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదా?

• ఈ రెండు ఫార్మా కంపెనీలకు దేశ ప్రజలందరికీ టీకా ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు. కేవలం ఆ రెండు సంస్థలే వాక్సిన్ ఉత్పత్తి చేస్తే దేశంలోని అందరికీ వాక్సిన్ అందడానికి మరో 3 సంవత్సరాల సమయం పడుతుంది. అప్పటి వరకు ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలేనా?

• ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు వాక్సిన్ తయారీకి నిధులు కేటాయించి వాక్సిన్ ఉత్పత్తి ని పెంచి ఉచితంగా వేయిస్తుంటే మన దేశంలో మాత్రం అలాంటి ప్రణాళికలు ఏమి లేకుండా ఎన్నికలే ప్రధానం, ఎన్నికల్లో గెలవాడమే లక్ష్యంగా పనిచేశారు. మతప్రతిపదికన కుంభమేళాకు అనుమతించడం అతిపెద్ద తప్పు అని ప్రపంచం మొత్తం వెలెత్తి చూపడం విధితమే.

• ఫార్మా మాఫియాతో చేతులు కలిపి కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతోందా?

• కేంద్ర ప్రభుత్వం మే నెలలో కేవలం 2 కోట్ల డోసులు మాత్రమే విడుదల చేసింది. వీటితో దేశవ్యాప్తంగా రోజు కేవలం 6.45 మందికే వాక్సిన్ అందుతుంది. మరి మిగతా వారి పరిస్థితి ఏమిటి?

• భారత్ బయోటెక్, సీరమ్ ఇండియా సంస్థలతో మోడి ప్రభుత్వం అంతర్గత ఒప్పందంతో దేశంలోని ఇతర ఫార్మా కంపెనీలకు వాక్సిన్ ఉత్పిత్తి చేసేందుకు గాని, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?

• దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు అయిన Zydus Cadila, Panacea Biotec, Dr Reddy’s, Hetero Drugs, VIRCHOW BIOTECH, Stelis Biopharma, Biological E. Limited (BE), Aurobindo Pharma కంపెనీలు వాక్సిన్ తయారు చేసేందుకు అనుమతులు కోరుతున్నాయి

• వాక్సిన్ ధరలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కాకుండా వాక్సిన్ ఉత్పత్తిదారులతో సమావేశాలు నిర్వహించి ధరలు నిర్ణయిస్తోంది.ఇప్పుడు వాక్సిన్ అందక పోవడం ఎవరి బాధ్యత?

• కేంద్ర ప్రభుత్వానికి ఒక డోసు రూ. 150 అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ. 400 లుగా, ప్రైవేట్ సంస్థలకు రూ. 600 లుగా కోవీషీల్డ్ వాక్సిన్ ఉత్పత్తి చేసే సీరమ్ కంపనీ నిర్ణయిస్తుందా? కేంద్ర ప్రభుత్వం విపత్తు సమయంలో అలా ఎలా అధికారాలు ఇస్తుంది?

• కేంద్రం ప్రభుత్వం వాక్సిన్ ఉత్పత్తిదారులకు 50 శాతం వాక్సిన్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఓపెన్ మార్కెట్ ధరలకు విక్రయించేందుకు అనుమతి ఇచ్చింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాపై పెద్ద భారం అవునా? కాదా?

• 18-44 వయస్సు వారికి వాక్సిన్ ఇచ్చే అంశంపై ప్రణాళికనూ రూపొందించేందుకు మోడి ప్రభుత్వం రాష్ట్రలను సంప్రదించకపోవడం కేంద్రం ప్రభుత్వం చేసిన తప్పా? కాదా?

• ఫార్మా కంపెనీలతో చేసుకున్న దుర్మార్గపు ఒప్పందాల వల్ల దేశ ప్రజల విలువైన ప్రాణాలు పోతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యమా? కాదా?