పందికి పాలిచ్చిన ఆవు.. గోమాత మాతృత్వంపై నెటిజన్ల ప్రశంసలు
(Excerpt) Pig | ఆవులు( Cows ) ఇతర జంతువులకు పాలు( Milk ) ఇవ్వవు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఓ ఆవు( Cow ).. పందికి పాలిచ్చింది. ఈ అరుదైన దృశ్యానికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతుంది.
Pig | పసిబిడ్డ ఆకలి( Hungry )తో అలమటించినప్పుడు.. తల్లి తన చనుబాలు( Mother Feeding ) ఇచ్చి ఆకలిని తీర్చుతుంది. ఇది ప్రకృతిలో సహజం. ఆ మాదిరిగానే కొన్ని జంతువులు కూడా తమ బిడ్డలకు పాలిచ్చి.. పోషించుకుంటాయి. అయితే ఒక జంతువు, మరో జంతువుకు పాలు ఇవ్వడం అనేది అరుదు. కానీ ఓ ఆవు( Cow ).. పంది( Pig )కి పాలిచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన వనపర్తి జిల్లా( Wanaparthy Dist ) ఆత్మకూరు పట్టణంలో బుధవారం వెలుగు చూసింది.
ఆత్మూరు పట్టణం( Atmakuru Town )లో ఉన్న శ్రీ సాయివాణి కల్యాణ మండపం ప్రాంగణంలో ఓ ఆవు పడుకొని ఉంది. అయితే ఆవు సేద తీరుతుండగా.. ఓ పంది అక్కడ ప్రత్యక్షమైంది. ఇక పడుకున్న గోమాత వద్దకు పంది వెళ్లి పాలు తాగింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న కొందరు వ్యక్తులు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
సామాన్యంగా ఆవులు పాలు ఇతర జంతువులకు ఇవ్వవు. కానీ మాతృత్వానికే మరోపేరుగా చెప్పుకునే గోమాత అయినందుకేనేమో ఆకలితో వచ్చిన వరాహానికి మాతృమూర్తిగా పాలు అందించింది. గోమాత మాతృత్వంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram