Revanth Reddy| అన్నదాతకు అన్నగా బాధ్యతతో రైతు భరోసా: సీఎం రేవంత్ రెడ్డి

అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని, రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నట్లుగా తెలిపారు.

Revanth Reddy| అన్నదాతకు అన్నగా బాధ్యతతో రైతు భరోసా: సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని, రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.  70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నట్లుగా తెలిపారు. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

ఆర్ధిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు… కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నాం. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నాం అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

నేడు సిద్దిపేట జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సిద్దిపేట,గజ్వేల్ నియోజవర్గాలలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సిద్దిపేట జిల్లాలో రూ.775.72 కోట్లతో పలు ప్రారంభోత్సవాలు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. టీజీ ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించడంతో పాటు రిఫైనరీకి శంకుస్థాపన చేయనున్నారు. నంగునూరు మండలం నర్మెట్టలో “ రైతు ఉత్సవాలు” కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేసి ప్రసంగిస్తారు.

సిద్దిపేట నియోజకవర్గంలో శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాల వివరాలు:

రూ.300 కోట్లతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం.
రూ.141.34 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన.
రూ.78 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో జిల్లా జైలు భవనం ప్రారంభోత్సవం.
రూ.15 కోట్లతో ఎన్సాన్‌పల్లిలో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి ప్రారంభోత్సవం.
రూ.3.60 కోట్లతో ఎన్సాన్‌పల్లి లో సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ప్రారంభోత్సవం.
రూ.1.43 కోట్లతో నంగునూరు మండలం గట్లమల్యాలలో PHC భవనం ప్రారంభోత్సవం.
రూ.1.43 కోట్లతో సిద్దిపేట మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్ లో నిర్మించిన UPHC భవనం ప్రారంభోత్సవం.

గజ్వేల్ నియోజకవర్గంలో శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాల వివరాలు:

రూ.200 కోట్లతో గజ్వెల్ నియోజకవర్గంలోని కొండపాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన.
రూ.16.62 కోట్లతో మర్కూక్ లోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో అదనపు మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన.
రూ.8.65 కోట్లతో మర్కూక్ లో సమీకృత మండల కార్యాలయాల సముదాయం (IOC) ప్రారంభోత్సవం
రూ.9.65 కోట్లతో జగదేవ్‌పూర్ లో సమీకృత మండల కార్యాలయాల సముదాయం (IOC) ప్రారంభోత్సవం.