cyber fraud| ఎమ్మెల్యేకు సైబర్ టోకరా..రూ.12 లక్షలు మాయం
ఏపీలోని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు తెలివిగా బురిడి కొట్టించారు. ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.12 లక్షలు కాజేశారు.
విధాత : సైబర్ నేరగాళ్లు తమకు సామాన్యులైన…ఎమ్మెల్యేలు, మంత్రులైన ఒక్కటేనంటూ అందరిని తమ నేరాలకు బలి చేస్తున్నారు. తాజాగా ఏపీ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టిన తీరు వైరల్ గా మారింది. ఏపీలోని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు తెలివిగా బురిడి కొట్టించారు. ఆయన బ్యాంకు ఖాతా నుంచి రూ.12 లక్షలు కాజేశారు. ఆర్టీఏ చలానా పేరుతో వచ్చిన లింక్‌ను పంపించి ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.12లక్షలు కాజేశారు. ఆ లింక్ ను ఎమ్మెల్యే క్లిక్ చేయడంతో ఎమ్మెల్యే బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైంది.
తను మోసపోయినట్లు గ్రహించిన ఎమ్మెల్యే.. తనకు ఎదురైన సైబర్ మోసంపై జీలుగుమిల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోగా..సైబర్ నేరగాళ్లు మోసాలు చేయడంలో సమన్యాయం పాటిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని..ఈ తరహా నేరాలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram