Man Ties 1000 Wala To Body | ఇదేమి పిచ్చి..ప్రాణాలు పోతాయిరోయ్!
పబ్లిసిటీ కోసం ఓ యువకుడు థౌజండ్ వాలా టపాసులను తన కాళ్లకు కట్టుకుని పేల్చుకున్నాడు. ఈ సాహసంలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ వీడియో వైరల్ కాగా నెటిజన్లు అతని దుస్సాహసాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

విధాత : వెర్రి వేయి రకాలు అంటారు. ఈ ఘటన చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఓ యువకుడు పబ్లిసిటీ కోసం చేసిన సాహసం అతని పిచ్చికి పరాకాష్టగా నిలిచింది. దీపావళి టపాసులను అందరి మాదిరిగా కాల్చితే తన స్పెషల్ ఏముంటుందనుకున్నాడో ఏమో మరి. ఏకంగా తన ఒంటికి కట్టుకుని పేల్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. టపాసులు పేలే సమయంలో తను ఎక్కడ కదిలిపోతానన్న ఆలోచనతో చేతులను పైకి వేలాడే పద్దతిలో బంధించి కట్టుకుని..తన కాళ్లకు థౌజండ్ వాలా టపాసులు కట్టుకున్నాడు.
ఆ తర్వాత ఆ బాంబులను కాల్చగా.. అవి వరుసగా పేలాయి. ఈ మంటల్లో ఆ యువకుడికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేమి పిచ్చిరా బాబు అనుకుంటూ ఆతని దుస్సాహసాన్ని తప్పుబడుతున్నారు. ఈ దుస్సాహాసంలో ఏ మాత్రం తేడా వచ్చిన అతని శరీరంలోని మరిన్ని భాగాలు మంటలకు గురయ్యేవని..ఇదంతా అతను రీల్స్ కోసమో లేక పందెం కోసం చేసినట్లుగా ఉందంటూ విమర్శిస్తున్నారు.
పిచ్చికి పరాకాష్ట అంటే ఇదే!
తన ఒంటికి టపాసులు చుట్టుకొని మరీ కాల్చుకున్న ఓ ప్రబుద్ధుడు
1000 Wala చుట్టుకొని కాల్చుకోగా.. అతని కాళ్లకి స్వల్ప గాయాలు
సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియో#Diwali #Deepavali #1000WalaCracker #viralvideo pic.twitter.com/SpuYQEUF8c
— SV6 NEWS (@Sv6News) October 21, 2025