Viral Video | బిహార్‌లో ఓ వృద్ధుడి వికృత చేష్టలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. డీజే ట్రక్కు మీద ఉన్న అమ్మాయిల పోస్టర్లను నాకుతూ.. ముద్దులు పెడుతూ నీచానికి దిగజారడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లో అమ్మాయిలకు పోస్టర్ల మీద కూడా రక్షణ లేకుండా పోయిందంటూ పెద్ద చర్చకు దారితీసింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ముజఫరాపూర్ జిల్లా గాయ్‌ఘాట్‌కు చెందిన విశానంద్ డీజే ట్రక్ ఓ కార్యక్రమం కోసం ఒక గ్రామానికి వెళ్లింది. ఆ ట్రక్కు రోడ్డుపై ఉండగానే గ్రామస్తులు, పిల్లలు దాని చుట్టూ చేరి ఆసక్తిగా చూడసాగారు. ఇంతలో ఓ వృద్ధుడు ట్రక్ దగ్గరకు వచ్చాడు. ట్రక్‌పై అతికించిన అమ్మాయిల పోస్టర్లను చూసి రెచ్చిపోయాడు. పోస్టర్లపై ఉన్న అమ్మాయిల పెదాలకు ముద్దులు పెడుతూ.. మొహాలను నాలుకతో నాకుతూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. చిన్న పిల్లలు చూస్తున్నారని కూడా పట్టించుకోకుండా అసభ్యంగా ప్రవర్తించాడు. అక్కడే ఉన్న పలువురు దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టులు చేయడంతో వృద్ధుడిపై ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Women are not safe even on the posters in India (Bihar here).
He is licking posters of those girls and you can see little girls there.
These are potential rapists who r*pe little girls first chance they get. pic.twitter.com/7xmf8FB8uv
— Jaswinder kaur (@TheReal_Jassi) May 21, 2026
మహిళలకు నిజ జీవితంలోనే కాదు.. పోస్టర్లపైనా రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. ఇది అసహ్యకరమైన ప్రవర్తన.. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్న పిల్లల ముందే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలను ఒక వస్తువులా చూసే దృక్పథం సమాజంలో ఇంకా కొనసాగుతోందని అభిప్రాయపడ్డారు.
Read More;
Viral News | ఏం మాయ చేసావే.. ఒక్క రోజులోనే కోటి మంది ఫాలోవర్లను సంపాదించిన చైనా బ్యూటీ!
