Viral Video | జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ వీడియోతో మళ్లీ వార్తల్లోకి గల్గోటియాస్ వర్సిటీ..!
Viral Video | ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ విశ్వవిద్యాలయం మరోసారి వార్తలోకి ఎక్కింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video | ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలోని గల్గోటియాస్ యూనివర్సిటీ మరోసారి వార్తలోకి ఎక్కింది. అప్పుడు చైనా రోబోను తీసుకొచ్చి తామే తయారు చేశామని చెప్పి ఏఐ సదస్సులో అభాసుపాలైన ఈ వర్సిటీ.. ఇప్పుడు ఓ వీడియాతో మరోసారి చర్చలోకి వచ్చింది. వర్సిటీలో చదువుకుంటున్న ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని కొట్టుకోవడం ఇప్పుడు వైరల్‌గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో గల్గోటియాస్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని మెట్ల దగ్గర నిలబడి ఉన్న ఇద్దరు విద్యార్థినులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఇద్దరు అమ్మాయిలు మెట్ల దగ్గర మాట్లాడుకుంటుండగా.. వాగ్వాదం పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకునే స్థితికి వచ్చింది. ఈ క్రమంలోనే ఒకరి చెంప మరొకరు పగులగొట్టుకుంటూ.. జుట్లు పట్టుకున్నారు.
ఇంత జరుగుతుంటే చుట్టూ ఉన్న విద్యార్థులు వారిని ఆపడానికి ప్రయత్నించకపోగా.. తమ ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోవడం గమనార్హం. గొడవ పడిన అమ్మాయిలు ఇద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది. ఒకరి బాయ్‌ఫ్రెండ్‌తో మరొకరు చనువుగా ఉండటం చూడలేకనే ఈ గొడవ జరిగిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు.
Kalesh b/w two besties at Galgotias University, Noida after one girl developed a crush on her bestie’s boyfriend.
pic.twitter.com/KBCxNtP1gs— Ghar Ke Kalesh (@gharkekalesh) March 28, 2026
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను @gharkekalesh అనే ట్విట్టర్ యూజర్ ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్రెండ్‌షిప్‌లో బాయ్‌ఫ్రెండ్ కూడా కామన్ అయిపోయాడా అని పలువురు వ్యంగ్యంగా స్పందించగా.. గల్గోటియా పేరు ప్రతిష్టలను చెడగొడుతున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. నెట్‌ఫ్లిక్స్ కంటే కూడా ఇప్పుడు గల్గోటియాస్ ఎక్కువ వినోదాన్ని పంచుతుందని మరొకరు కామెంట్ చేశారు. కాగా ఈ వైరల్ వీడియోపై గల్గోటియాస్ యూనివర్సిటీ మాత్రం ఇంకా స్పందించలేదు.
Read More:
డ్యాన్స్ చేస్తూ పిల్లాడి చెంప పగులగొట్టిన రోబో.. వీడియో వైరల్
Keelback Snakes | దేశంలోకి కొత్త పాములొచ్చాయ్…
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram