Viral Video | డ్యాన్స్ చేస్తూ పిల్లాడి చెంప పగులగొట్టిన రోబో.. వీడియో వైరల్

Viral Video | చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో ఇచ్చిన ఓ ప్రదర్శనలో డ్యాన్స్ చేసిన ఓ హ్యూమనాయిడ్ రోబో.. పొరపాటున పక్కన ఉన్న పిల్లాడి చెంప పగులగొట్టింది. ఆ తర్వాత బాలుడు నొప్పితో విలవిల్లాడుతుంటే.. రోబో మాత్రం ఎంచక్కా డ్యాన్స్ చేస్తూ ఉండిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Viral Video | డ్యాన్స్ చేస్తూ పిల్లాడి చెంప పగులగొట్టిన రోబో.. వీడియో వైరల్

Viral Video | సినిమాల్లో చూపించినట్లుగా.. ఇప్పుడు నిజ జీవితంలోనూ అన్ని పనులు చేసే హ్యూమనాయిడ్ రోబోలు వచ్చేస్తున్నాయి. ఇంటి పనుల నుంచి మొదలు డ్యాన్స్‌లు, ఫైట్‌లు ఇలా వివిధ పనులు చేసేలా ఈ రోబోలను తయారుచేసి ఆశ్చర్యపరుస్తున్నారు. కానీ ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన రోబోలు పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడం లేదనే చెప్పొచ్చు. అందుకు చైనాలో నిర్వహించిన ఓ పబ్లిక్ షోలో డ్యాన్స్ చేస్తూ ఓ రోబో చిన్న పిల్లాడి చెంప పగులగొట్టడమే ఉదాహరణ! ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో మార్చి 21వ తేదీన జీ1 హ్యూమనాయిడ్ రోబో ప్రదర్శన జరిగింది. ఈ ఈవెంట్‌లో యూనిట్రీ కంపెనీ తయారు చేసిన ఓ రోబో డ్యాన్స్ చేస్తూ ప్రదర్శన ఇచ్చింది. ఆ వింతను చూసేందుకు అక్కడ పెద్ద ఎత్తున జనాలు గుమిగూడారు. రోబో డ్యాన్స్ చేస్తుంటే చిన్నా పెద్దా అక్కడ చేరి ఆసక్తిగా రోబో డ్యాన్స్ చూడసాగారు. ఇంతలో గిరగిరా తిరుగుతున్న రోబో చెయ్యి వెళ్లి అక్కడ పక్కన నిల్చున్న ఓ పిల్లాడి చెంపకు బలంగా తాకింది. దీంతో ఆ పిల్లాడు చెంపను పట్టుకుని విలవిల్లాడిపోయాడు. అయినప్పటికీ రోబో మాత్రం ఆగకుండా డ్యాన్స్ చేయడం గమనార్హం.

 


రోబో చెయ్యి పిల్లాడికి తగలగానే అక్కడ ఉన్న కంపెనీ సిబ్బంది అప్రమత్తమయ్యాడు. వెంటనే వెళ్లి రోబోను పక్కకు తీసుకొచ్చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదర్శన అని వ్యాఖ్యానించారు. ఎంతైనా మనుషులు మనుషులే.. యంత్రాలు యంత్రాలే.. వాటికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. రాబోయే కాలంలో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఈ డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చిన రోబోను యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన జీ1 హ్యూమనాయిడ్ మోడల్‌గా భావిస్తున్నారు. సుమారు 35 కిలోల బరువు ఉండే ఈ రోబో ధర దాదాపు రూ.13,500 డాలర్ల నుంచి ప్రారంభవుతుంది.

Read More:

Viral Video | అందాల పోటీల్లో స్టేజీపైనే పళ్లు ఊడిపోయినా.. కూల్‌గా హ్యాండిల్ చేసిన బ్యూటీ క్వీన్!

తొలిసారి భారత్‌లో కనిపించిన రెండు సర్పజాతులు.. ఇవీ వాటి ప్రత్యేకతలు

నా కడుపులో విరాట్ కోహ్లీ బిడ్డను మోస్తున్నా..యువతి హల్చల్