Destination Wedding | ఇదేం పోయేకాలం.. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో శ్మశానంలో పెళ్లి చేసుకున్న జంట!

Destination Wedding | డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఓ జంట చేసిన వింత చేష్టలకు పాల్పడింది. సాంప్రదాయబద్ధంగా చేసుకోవాల్సిన వివాహాన్ని శ్మశాన వాటికలో చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ (Ghaziabad)కు చెందిన యువ జంట చేసిన పని ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో స్థానికులు, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

Destination Wedding | డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో ఓ జంట చేసిన వింత చేష్టలకు పాల్పడింది. సాంప్రదాయబద్ధంగా చేసుకోవాల్సిన వివాహాన్ని శ్మశాన వాటికలో చేసుకుంది. శవాలు కాల్చే చోట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ (Ghaziabad)కు చెందిన యువ జంట చేసిన పని ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో స్థానికులు, ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ జంట‌కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 25వ తేదీన ముహూర్తం కూడా ఖరారైంది. అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఆ జంట మొదట్నుంచి భావించింది. ఈ క్రమంలో తమ పెళ్లి కోసం అనేక ప్రాంతాలను వారు వెతికారు. అందరి పెళ్లిళ్లలో ఉన్న కామన్ ప్లేస్‌లు కాకుండా డిఫరెంట్ ప్రాంతాల కోసం చూశారు. కానీ ఏవీ నచ్చకపోవడంతో చివరకు శ్మశాన వాటికలో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

తమ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఉత్తరాఖండ్ అల్మోరా జిల్లాలోని రామ్‌గంగా-బడంగాడ్ నదుల సంగమం వద్ద ఉన్న శ్మశాన వాటికను వెళ్లి వేదికగా ఎంచుకున్నారు. ఆ ఘాట్‌ను పూలమాలలతో అలంకరించి శవాలను కాల్చే చోటనే ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సుమారు 50 మంది వరకు అతిథులు కూడా హాజరయ్యారు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.

‘శ్మశానం అంటే నెగెటివ్ ఎనర్జీ .. అక్కడ పెళ్లి చేసుకుని తప్పు చేశారు’ అని.. ‘పెళ్లంటే పిల్లల ఆట కాదు.. పెద్దలు ఏం చెప్పినా బలమైన కారణం ఉంటుంది’ అని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ‘శ్మశానంలో పెళ్లి చేసుకుంటే జీవితాలు నాశనమవుతాయి’ అని మరికొందరు వ్యాఖ్యానించారు. సోషల్‌మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం చేసే స్టంట్లు ఇలానే ఉంటాయని పలువురు విమర్శించారు.

ధార్మిక సంఘాల ఆగ్రహం నేపథ్యంలో శ్మశాన వాటికలో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఎవరిచ్చారనే దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. వివాహం జరిపించిన సంబంధిత రిసార్ట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read More:

Viral Marriage | 68 కోట్ల కట్నం ఇచ్చి.. పాతికేళ్ల కుర్రాడిని పెళ్లి చేసుకున్న 55 ఏళ్ల మహిళా వ్యాపారవేత్త

Viral Video | పెళ్లిలో ఇవేం అతిథి మర్యాదలు..! పొట్టి దుస్తుల్లో యువతులతో డ్రింక్స్ సర్వ్.. వీడియో వైరల్

Latest News