Viral Photo | ఒకే స్కూటర్‌పై ఆరుగురు చిన్నారులు ప్రయాణిస్తున్నట్లు కనిపించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూరు రోడ్లపై తీసిన ఈ చిత్రం రోడ్డు భద్రతపై పెద్ద చర్చకు దారితీసింది.
శ్రేయాస్ శ్రేయు అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఏప్రిల్ 26వ తేదీన ఒక ఫొటో షేర్ చేశారు. అందులో ఒకే బైక్‌పై ఆరుగురు చిన్నారులు వెళ్తున్నారు. ఈ ఫొటో పదరాయణపుర మెయిన్ రోడ్డులోని గౌరీపాళ్య సమీపంలో ఉదయం 10.45 గంటలకు తీసినట్లుగా పేర్కొన్నారు. అంతేకాకుండా బెంగళూరు సిటీ పోలీసులు, స్థానిక ట్రాఫిక్ అధికారులను ట్యాగ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటోలో ఒక బాలుడు స్కూటర్‌ను నడుపుతుండగా.. అతని వెనుక మరో ఐదుగురు చిన్నారులు కూర్చున్నారు. వారిలో ఎవరూ హెల్మెట్ ధరించలేదు. వారు నిజంగా రోడ్డుపై ప్రయాణిస్తున్నారా? ఫొటో కోసం మాత్రమే పోజిచ్చారా? అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. కానీ ఫోటోను షేర్ చేసిన శ్రేయాస్ మాత్రం వారు రోడ్డుపైనే వెళ్తున్నారని పేర్కొన్నారు.
This is haappend on today 26/04/2026 morning 10:45 am those kid’s illegally ridding scooter No. ( KA05JZ9065 ) on location ( Padarayanapura main road near gowripalya on opposite of total engineer auto gas ) new Bridge. please take necessary. @BlrCityPolice @blrcitytraffic pic.twitter.com/S4rrOE8vbD
— Shreyas Shreyu (@Shreyas35240282) April 26, 2026
సోషల్‌మీడియా వేదికగా చేసిన ఫిర్యాదును బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు స్వీకరించి, మగడి రోడ్డు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు విచారణ కోసం పంపించారు. భారత ట్రాఫిక్ చట్టాల ప్రకారం మైనర్లు వాహనం నడిపేందుకు అనుమతించడం శిక్షార్హమైన నేరం. దీనికి వాహన యజమాని లేదా పిల్లల సంరక్షకులదే బాధ్యత ఉంటుంది. దీంతో సదరు చిన్నారుల తల్లిదండ్రులపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఫొటోపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు నిజంగానే వాహనం నడిపారా? కేవలం ఫొటో కోసం కూర్చున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
