వైరల్ వీడియో :చెమట పరాటా చూసారా ఎప్పుడైనా? ఇదిగో చూడండి!

సోషల్ మీడియాలో వైరల్ అయిన “పసీనా పరాఠా” వీడియో స్ట్రీట్ఫుడ్ శుభ్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. నెటిజన్లు షాక్ అవుతూ వ్యంగ్యాలు, విమర్శలు చేస్తున్నారు.

వైరల్ వీడియో :చెమట పరాటా చూసారా ఎప్పుడైనా? ఇదిగో చూడండి! Street vendor making viral Paseena Parantha touching arms and armpits

సోషల్ మీడియా వేదిక X (మాజీ ట్విట్టర్)లో ఒక వీడియో వైరల్ అవుతూ నెటిజన్లను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఇందులో ఓ వీధి భోజన కౌంటర్‌ యజమాని భారీ పరాటా తయారు చేస్తుండగా, పిండి ముద్దను చేతుల మీద నుంచి బుగ్గల వరకు పెట్టుకొని వెడల్పు చేస్తున్న దృశ్యం కనిపించింది.

చేతులతో మాత్రమే కాకుండా, బుగ్గల దగ్గరగా తీసుకెళ్లడం, షర్ట్ స్లీవ్స్‌కు తగలడం, పూర్తిగా అరచేయి నుండి మోచేతి దాకా చేయి మీద వేసుకోవడం వంటి సన్నివేశాలు ఇంటర్నెట్‌లో గగుర్పాటు కలిగించాయి. “ఇలాంటి వంటకమేనా మనం తినేది?” అంటూ చాలా మంది అసహ్యం వ్యక్తం చేశారు.

వైరల్ ప్రతిస్పందనలు

వీడియోకి జతగా “పసీనా పరాటా: బయట తినకూడదనడానికి ఇదొక కారణం” అనే శీర్షిక పెట్టారు. ఇప్పటికే ఈ వీడియో 3 లక్షలకుపైగా వీక్షణలు సాధించింది. ఇదిగో ఆ వీడియో చూడండి…

  • “అది చెమట కాదు… చేతి చమురు” అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు.
  • “రోటీని వేడెక్కిన కడాయిపై వేస్తే చెమట ఆవిరైపోతుందేమో?” అని మరికొందరు సరదాగా స్పందించారు.
  • “జీరో హైజీన్, జీరో సేఫ్టీ” అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
  • “ఇక బయట తినడమే మానేశా” అని పలువురు రాసుకున్నారు.
  • “తినడం సంగతి తర్వాత…ముందు వాంతులు రాకుండా చూసుకోవాలి” అన్నవారు ఇంకొందరు.
  • “మన స్ట్రీట్ ఫుడ్ రుచి అద్భుతమే కానీ వంట చేయడం చూస్తే తినలేం” అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది మొదటి ఘటన కాదు. గతంలో కూడా “పిటాయి పరాఠా” అనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశమైంది.