లక్షా 57 వేల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

విధాత,న్యూఢిల్లీ: భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ కింద దేశంలో లక్షా 57 వేల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ కల్పించినట్లు పంచాయతీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేష్వర్‌ పాటిల్‌ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2023 ఆగస్టు నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించే విధంగా భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 9 నాటికి దేశంలో లక్షా 57 వేల 919 గ్రామ […]

లక్షా 57 వేల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు

విధాత,న్యూఢిల్లీ: భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ కింద దేశంలో లక్షా 57 వేల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ కల్పించినట్లు పంచాయతీ రాజ్‌ శాఖ సహాయ మంత్రి కపిల్‌ మోరేష్వర్‌ పాటిల్‌ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2023 ఆగస్టు నాటికి దేశంలోని అన్ని గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించే విధంగా భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 9 నాటికి దేశంలో లక్షా 57 వేల 919 గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం కల్పించినట్లు చెప్పారు.

భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ ఫేజ్‌ 1 కింద కేవలం అండర్‌ గ్రౌండ్‌ ఆప్టిక్‌ ఫైబర్‌ కేబుల్‌ కింద గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు కల్పించే పనులు చేపట్టడంతో రైట్‌ ఆఫ్‌ వే సమస్యలతో ప్రాజెక్ట్‌ అమలులో సమస్యలు తలెత్తినట్లు మంత్రి చెప్పారు. భారత్‌నెట్‌ ఫేజ్‌ 2 కింద ఆంధ్రప్రదేశ్‌తో సహా 8 రాష్ట్రాలలో 65 వేల గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సారధ్యంలో అమలు జరుగుతోంది. అయితే నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు జరగనందున ప్రాజెక్ట్‌ గడువుపై దాని ప్రభావం పడుతోందని చెప్పారు.