అమాంతం పెరిగిన కొత్త కేసులు.. కలవరపెడుతోన్న కేరళ పరిస్థితి

విధాత‌: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు అమాంతం పెరిగి, 46 వేలకు చేరాయి. అందులో 31 వేల కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూశాయి. ఆ రాష్ట్రంలో వైరస్ తీవ్రత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా 600 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. తాజాగా 17,87,283 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 46,164 మందికి వైరస్ […]

అమాంతం పెరిగిన కొత్త కేసులు.. కలవరపెడుతోన్న కేరళ పరిస్థితి

విధాత‌: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా కొత్త కేసులు అమాంతం పెరిగి, 46 వేలకు చేరాయి. అందులో 31 వేల కేసులు ఒక్క కేరళలోనే వెలుగుచూశాయి. ఆ రాష్ట్రంలో వైరస్ తీవ్రత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలను కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా 600 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మళ్లీ క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది.

తాజాగా 17,87,283 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 46,164 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 22.7 శాతం మేర పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 3.25 కోట్లకు చేరాయి. నిన్న మరో 607 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 200మందికి పైగా మృతి చెందారు. ఇప్పటివరకు మొత్తం 4,36,365 మంది మహమ్మారికి బలయ్యారు.

ఈ రోజు కూడా నమోదైన కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే తక్కువగా ఉంది. తాజాగా 34,159 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.17 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 97.63 శాతంగా ఉండగా.. క్రియాశీల రేటు మళ్లీ ఒక శాతం దాటింది. ప్రస్తుతం 3,33,725 మంది వైరస్‌తో బాధపడుతున్నారు.

60 కోట్ల మార్కు దాటిన టీకా డోసుల పంపిణీ..

దేశంలో జనవరి 16న కరోనా టీకా కార్యక్రమం ప్రారంభమైంది. దానికింద ఇప్పటి వరకు 60 కోట్ల 38 లక్షల డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న ఒక్కరోజే 80,40,407 మంది టీకా వేయించుకున్నారు. ఇటీవల కాలంలో టీకా కార్యక్రమంలో వేగం కనిపిస్తోంది.