ఆంధ్రకు గుడ్ న్యూస్… ఒడిశా కు షాక్

వంశధార ట్రైబ్యునల్‌ తీర్పునకు సంబంధించి కీలక అంశాలు: విధాత:ఏపీకి సానుకూలంగా వంశధార ట్రైబ్యునల్‌ తీర్పు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ట్రైబ్యునల్‌ అనుమతి. ఏపీ అవసరాలకోసం బ్యారేజీకి కుడివైపున హెడ్‌స్లూయిస్‌ నిర్మాణానికి అంగీకారం.8వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌.ఒడిశా అవసరాలకోసం ఎడమవైపున కూడా స్లూయిస్‌ నిర్మాణానికి ఓకే చెప్పిన ట్రైబ్యునల్‌.ఎంత సామర్థ్యంతో ఎడమ స్లూయిస్‌ కావాలో గెజిట్‌ విడుదలచేసిన 6 నెలల్లోపు ఏపీకి ఒడిశా తెలియజేయాలని ఆదేశాలు.ఎడమ స్లూయిస్‌కోసం అయ్యే ఖర్చును […]

ఆంధ్రకు గుడ్ న్యూస్… ఒడిశా కు షాక్

వంశధార ట్రైబ్యునల్‌ తీర్పునకు సంబంధించి కీలక అంశాలు:

విధాత:ఏపీకి సానుకూలంగా వంశధార ట్రైబ్యునల్‌ తీర్పు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణానికి ట్రైబ్యునల్‌ అనుమతి. ఏపీ అవసరాలకోసం బ్యారేజీకి కుడివైపున హెడ్‌స్లూయిస్‌ నిర్మాణానికి అంగీకారం.8వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌.
ఒడిశా అవసరాలకోసం ఎడమవైపున కూడా స్లూయిస్‌ నిర్మాణానికి ఓకే చెప్పిన ట్రైబ్యునల్‌.
ఎంత సామర్థ్యంతో ఎడమ స్లూయిస్‌ కావాలో గెజిట్‌ విడుదలచేసిన 6 నెలల్లోపు ఏపీకి ఒడిశా తెలియజేయాలని ఆదేశాలు.
ఎడమ స్లూయిస్‌కోసం అయ్యే ఖర్చును ఒడిశా భరించాలన్న ట్రైబ్యునల్‌ జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ నీటిని తరలించుకునేందుకు ఏపీకి ట్రైబ్యునల్‌ అనుమతి నేరడి బ్యారేజీకోసం ఒడిశాలో ముంపునకు గురవుతున్న 106 ఎకరాల భూమిని ఒడిశా సేకరించి ఇవ్వాలన్న ట్రైబ్యునల్‌
దీనికోసం అయ్యే ఖర్చును ఏపీ భరించాలని తీర్పులో పేర్కొన్న ట్రైబ్యునల్‌ తీర్పును అమలు చేసేందుకు అంతర్‌రాష్ట్ర నియంత్రణ కమిటీని ఏర్పాటుచేయాలంటూ ట్రైబ్యునల్‌ తీర్పు.