లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఛైర్మన్‌గా జస్టిస్‌ ఖాన్విల్కర్‌

విధాత‌: సుప్రీంకోర్టు న్యాయ సేవా సంస్థ (లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ) ఛైర్మన్‌గా జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్విల్కర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ గెజిట్‌ విడుదల చేసింది. ఇంతవరకు ఈ పదవిలో కొనసాగిన జస్టిస్‌ రొహింగ్టన్‌ ఫాలీ నారిమన్‌ ఇటీవల పదవీ విరమణ చేయడంతో తాజా నియామకాన్ని చేపట్టారు.