పోలవరం సవరించిన వ్యయానికి సలహా సంఘం ఆమోదం

విధాత,న్యూఢిల్లీ, ఆగస్టు 2: పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి జనవరి 2011, ఫిబ్రవరి 2019లో సవరించిన అంచనా వ్యయానికి ప్రాజెక్ట్‌ సలహా సంఘం ఆమోదం తెలిపిందని జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు.రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన సవివర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) ఏదీ రాష్ట్ర ప్రభుత్వం తమ ఆమోదానికి పంపించలేదని చెప్పారు. 10,151 కోట్ల అంచనా వ్యయం (2005-06 ధరల ప్రాతిపదికపై)తో పోలవరం […]

పోలవరం సవరించిన వ్యయానికి సలహా సంఘం ఆమోదం

విధాత,న్యూఢిల్లీ, ఆగస్టు 2: పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి జనవరి 2011, ఫిబ్రవరి 2019లో సవరించిన అంచనా వ్యయానికి ప్రాజెక్ట్‌ సలహా సంఘం ఆమోదం తెలిపిందని జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు.రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన సవివర ప్రాజెక్ట్‌ నివేదిక (డీపీఆర్‌) ఏదీ రాష్ట్ర ప్రభుత్వం తమ ఆమోదానికి పంపించలేదని చెప్పారు. 10,151 కోట్ల అంచనా వ్యయం (2005-06 ధరల ప్రాతిపదికపై)తో పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌ను ఇరిగేషన్‌,వరదల నియంత్రణ,బహుళార్ధసాధక ప్రాజెక్ట్‌లకు సంబంధించిన సలహా సంఘం 2009 జనవరి 20న జరిగిన 95వ సమావేశంలో అమోదించిందని మంత్రి వెల్లడించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ సవరణ కోసం ఎలాంటి ప్రతిపాదన చేయలేదని చెప్పారు.