విధాత : వన్యప్రాణులు ఆహారం కోసం పరస్పరం వేటాడుకోవడం సాధారణంగా చూస్తుంటాం. అయితే ఆకాశంలో విహరించే గద్ద నేలపైన జంతువులను వేటాడాలంటే చాల సమయస్ఫూర్తి చూపాలి. సహజంగానే గద్దలు(గరుడ పక్షులు) నేలపై తమ ఆహార జీవిని వేటాడటంలో ఖచ్చితమైన నైపుణ్యంతోనే వ్యవహరిస్తుంటాయి. అయితే ఆ సమయంలో అవతలి జంతువు తప్పించుకోవడంలో చూపే లాఘవం గద్దలను బోల్తా కొట్టిస్తుంటుంది. అలాంటి ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పచ్చిక బైళ్లలో గడ్డి మేస్తున్న ఓ కుందేలును ఆకాశం నుంచి గమనించిన ఓ గద్ద దానిని వేటాడాలని నిర్ణయించుకుంది. ఆకాశంలో సంచరిస్తూ కుందేలును తన కాళ్లతో ఎగరేసుకుపోయేందుకు నేలపై సర్రున దూసుకొచ్చింది. అదృష్టవశాత్తు గద్దను గమనించిన కుందేలు చాకచక్యంగా గద్ద కాళ్లకు, నోటికి చిక్కకుండా పక్కకు తప్పుకుంది. నేలకు దిగిన గద్ద తనను పట్టుకునే క్రమంలోనే కుందెలు వేగంగా పక్కకు తప్పుకుని గద్దకంటే పైకి గాలిలోకి ఎగిరింది.
తన నుంచి తప్పించుకున్న కుందేలును గమనించి తిరిగి పట్టుకునేందుకు గద్ద వెనక్కి తిరిగే లోపునే కుందేలు మెరుపు వేగంతో అక్కడి నుంచి పరుగు లంఘించుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భూమిపై కుందేలు నూకలున్నందునే అది గద్ద నుంచి తప్పించుకుందంటూ కొందరు..ప్రాణాలు కాపాడుకోవడంలో కుందేలు చాకచక్యంగా తెలివితో వ్యవహరించి గద్దను బోల్తా కొట్టించిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
— Wildlife Uncensored (@TheeDarkCircle) September 19, 2025