Birds and Sheep dancing In Sync | అద్బుతం..ఆకాశంలో పక్షులు..నేలపై గొర్రెలు కలిసి నృత్యం!

ఆకాశంలో పక్షులు, నేలపై గొర్రెలు కలిసి చేసిన అద్బుత నృత్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది.

Birds and Sheep dancing In Sync | అద్బుతం..ఆకాశంలో పక్షులు..నేలపై గొర్రెలు కలిసి నృత్యం!

విధాత : ప్రకృతిలో అనంతకోటి జీవరాశి ప్రయాణం ఎన్నో అద్బుతాలు..వింతలు..విశేషాలతో సాగుతుంటుంది. ప్రకృతి ఒడిలో జీవరాశులు చేసే అద్భుతాలు ఒక్కోసారి వింతగా కనువిందు చేస్తుంటాయి. అలాంటిదే ఈ ఘటన కూడా. ఒకేసారి ఆకాశంలో విహరించే పక్షులు..నేలపై వెలుతున్న గొర్రెలు కలిసి నాట్యమాడిన అరుదైన అద్బుత దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ క్షణాన ప్రకృతి..మేఘాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయోగాని..పరవశంతో ఆకాశంలోని విహాంగాలు..పచ్చిక బైళ్లలో మేస్తున్న గొర్రెలు ఒకే సమయంలో పరవశానికి లోనయి..తన్మయత్వంతో ఆడాయి. వందలాది పక్షుల సమూహాలు ఆకాశంలో రకరకాల ఆకృతులను తలపిస్తూ గ్రూప్ డ్యాన్స్ చేసిన దృశ్యం కన్నులతో చూసి తీరాల్సిందే.

భూమిపైన పచ్చిక బైళ్లలో ఉన్న గొర్రెలకు ఎందుకంతగా సంతోషం కల్గిందోగాని వలయకారంలో పరుగులు తీస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. దివిలో విహాంగాలు..భువిలో గొర్రెలు చేసిన ఈ నృత్య విన్యాసాల వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటు ట్రెండింగ్ లో దూసుపోతుంది.