Viral: కూల‌ర్‌లో దాగి.. అడ్డంగా దొరికిండు! ఓల్డ్‌ వీడియో వైర‌ల్‌

  • By: sr    videos    Apr 11, 2025 6:35 PM IST
Viral: కూల‌ర్‌లో దాగి.. అడ్డంగా దొరికిండు! ఓల్డ్‌ వీడియో వైర‌ల్‌

Viral:

విధాత: చాటుమాటు ప్రేమలు..అక్రమ సంబంధాలలో మునిగితేలే వారు తమ బండారం బయటపడకుండా నానా పాట్లు పడుతుంటారు. తేలుకుట్టిన దొంగలా దొరికిపోయే సందర్భం ఎదురైతే తప్పించుకునేందుకు మంచం..బీరువాలు..సామాను గదుల్లో..ఇలా ఏది దొరికితే దానిలో దూరిపోయి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇక్కడో ప్రియుడు మాత్రం తన అక్రమ సంబంధం బాగోతం బయటపడే పరిస్థితుల్లో దాక్కునేందుకు ఓ పాత కూలర్ లో చొరబడి అడ్డంగా దొరికిపోయాడు.

ఓ యువతితో ప్రేమాయణం కొనసాగిస్తున్న యువకుడు ఆమె ఇంట్లోకి వెళ్లాడు. రాత్రివేళ ఇంట్లో ఏదో శబ్ధాలు రావడం..ఆ సమయంలో కుక్కలు మొరగడంతో.. ఎవడో దొంగ వచ్చాడన్న అనుమానంతో ఇంట్లో అంతా వెతకడం ప్రారంభించారు. వారిని చూసిన యువకుడు తప్పించుకునే క్రమంలో ఇంట్లోని పాతకూలర్ లో దూరాడు. అయితే అతడి కోసం ఇల్లంతా వెతికిన కుటుంబ సభ్యులకు ఎవరు కనిపించక పోవడంతో పాటు యువతి ఏదో దాస్తుందని గమనించారు.

అదే సమయంలో ఇంట్లో ఉన్న కూలర్ లో ఏదో ఉందన్న అనుమానంతో దానిని తిప్పి చూడగా బండారం బయటపడింది. తేలుకుట్టిన దొంగలా దొరికిపోయిన యువకుడు మెల్లగా కూలర్ నుంచి బయటకు వచ్చాడు. ప్రియుడు దొరికిపోవడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆమెపై తిట్ల దండకం అందుకున్నారు. అయితే ఈ నిర్వాకంలో ఆ యువతి మాత్రం అతడు కూలర్ లోకి ఎప్పుడెళ్లాడో తనకు తెలియదంటూ అమాయకంగా బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికి తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.