Viral: నీ క్రియేటివిటికీ దండం తల్లో.. వాషింగ్ మెషిన్‌తో ఆలుగడ్డల పొట్టు తీయొచ్చా..!?

  • By: sr    videos    Apr 08, 2025 7:13 AM IST
Viral: నీ క్రియేటివిటికీ దండం తల్లో.. వాషింగ్ మెషిన్‌తో ఆలుగడ్డల పొట్టు తీయొచ్చా..!?

Viral:

విధాత : నూతన ఆవిష్కరణల వైపు మనిషి ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓ వైపు ఏఐ వంటి సాంకేతిక విప్లవం వెంట ప్రపంచం వేలం వెర్రిగా పయనిస్తుంటే ఇంకోవైపు ఇప్పటికే ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సరికొత్త పనులకు వాడుతూ మరికొందరు నూతన ఆవిష్కరణకు కొత్త అర్థం చెబుతున్నారు. అలాంటితే వాషింగ్ మెషిన్-ఉల్లిగడ్డల కథ కూడా. సాధారణంగా ఎక్కడైనా వాషింగ్ మెషిన్ ను అంతా బట్టలు ఉతికేందుకు వాడుతుంటారు. కొందరు షూస్ ను ఉతికేందుకు కూడా వాడుతుంటారు. ఇక వంట పాత్రలు కడిగే మెషిన్ వేరే ఉంది.

అయితే ఓ మహిళ బట్టలు ఉతికేందుకు వాడే వాషింగ్ మెషిన్ ను ఆలుగడ్డల పొట్టు తీసేందుకు వాడి తనలోని వినూత్న ఆలోచనను, సృజనాత్మకతను చాటుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆ మహిళ వాషింగ్ మెషిన్ లో ఆలుగడ్డలు వేసి..కొద్ది సేపటికి అవి పొట్టులేకుండా మారాకా.. వాటిని మెషిన్ నుంచి తీసింది. ఈ వీడియో వైరల్ గా మారగా.. వాషింగ్ మెషిన్ ను ఇట్లా కూడా వాడవచ్చా అంటూ నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

మహిళ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం అలాంటి పనితో వాషింగ్ మెషిన్ పాడైపోతుందంటూ కామెంటు పెడుతున్నారు. అయితే ఈ వీడియో అంతా ఓ ఫేక్.. స్టంట్ మాత్రమేనని అది నిజం అనుకుని వాషింగ్ మెషిన్ ను ఆలుగడ్డల కోసం వాడితే ఆ మెషిన్ పని అయిపోయినట్లేనని మరికొందరు కామెంట్లు చేశారు.