రావణుడి పాత్ర ధారితో అశ్లీల నృత్యాలు
దసరా వేడుకల్లో రావణుడి పాత్ర ధారితో కలిసి ఒక రికార్డింగ్ డ్యాన్సర్ అర్థనగ్న దుస్తులతో అశ్లీల నృత్యం చేసిన వీడియో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విధాత: ఇటీవల వినాయక చవితి, దసరా, సంక్రాంతి వేడుకల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్స్ ల పేరిట అశ్లీల నృత్య ప్రదర్శనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ పట్టణంలో జరిగిన దసరా వేడుకల్లో రావణుడి పాత్రధారి తొడలపై కూర్చుని రికార్డింగ్ డ్యాన్సర్ అర్థనగ్న దుస్తులతో చేసిన అశ్లీల నృత్యం హిందుత్వ వాదుల ఆగ్రహానికి గురవుతుంది. ‘ఆజ్ కీ రాత్ మజా హుస్న్ కా’ అనే ఐటెమ్ సాంగ్‌పై రావణుడి పాత్ర ధారితో దసరా వేడుకల్లో అంగాంగ ప్రదర్శనతో చిందులు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్ల దసరా వేడుకల్లో అశ్లీల నృత్య ప్రదర్శనలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. హిందూ పండుగల్లో ఇలాంటి అశ్లీల నృత్యాలు అంతర్భాగమా? అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సనాతన ధర్మ రక్షకులు ఏం సమాధానం చెబుతారంటూ మండిపడుతున్నారు.